News September 21, 2025

సంగారెడ్డి: ఓపెన్ స్కూల్ పరీక్షలకు 893 మంది విద్యార్థులు

image

సంగారెడ్డి జిల్లాలో 22 నుంచి 28 వరకు ఓపెన్ స్కూల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఓపెన్ స్కూల్ జిల్లా సమన్వయకర్త వెంకటస్వామి శనివారం తెలిపారు. పదో తరగతికి 272, ఇంటర్‌కు 621, మొత్తం 893 మంది విద్యార్థులు హాజరవుతారని చెప్పారు. పదో తరగతికి జడ్పీ బాలికల, ఇంటర్‌కు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News September 21, 2025

ఎల్కతుర్తి: ఎంగిలిపూల బతుకమ్మని ఎందుకు అంటారంటే?

image

బతుకమ్మని పేర్చేందుకు ఒకరోజు ముందే రకరకాల పువ్వులను సేకరించి వాటిని నీటిలో వేసి నిల్వ చేస్తారు. ఇలా ఒకరోజు నిద్ర చేసిన పువ్వులతో బతుకమ్మని మొదటి రోజున పేరుస్తారు. అందుకే కొన్ని ప్రాంతాల్లో ఎంగిలిపూల బతుకమ్మని.. మరికొన్ని ప్రాంతాల్లో తిన్న తర్వాత బతుకమ్మని పిలుస్తారు. బతుకమ్మ అందమైన పూల సంబరం. ఈరోజు నువ్వులు, బియ్యం పిండి, నూకల పిండి కలిపి నైవేద్యం సమర్పిస్తారు.

News September 21, 2025

BCCI కొత్త అధ్యక్షుడు ఇతడేనా?

image

జమ్మూకశ్మీర్‌కు చెందిన మాజీ క్రికెటర్ మిథున్ మన్హాస్ బీసీసీఐ అధ్యక్షుడి రేసులో ముందున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. రోజర్ బిన్నీ తర్వాత ఇతడికే పదవి దక్కే ఛాన్స్ ఉంది. ఇవాళ ఢిల్లీలో జరిగే వార్షిక సమావేశంలో కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటించనున్నారు. ఢిల్లీ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన మిథున్ 9వేలకు పైగా రన్స్ చేశారు. ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడలేదు. IPL(2008-14)లో ఆడిన తొలి J&K ప్లేయర్‌గా నిలిచారు.

News September 21, 2025

VJA: భక్తులతో ‘ఫోన్ ఇన్’లో దుర్గగుడి EO ఏమన్నారంటే.?

image

దసరా నేపథ్యంలో భక్తులతో ‘ఫోన్ ఇన్’లో వచ్చిన పలు అంశాలపై EO శీనా నాయక్ ఏర్పాట్ల గురించి వివరించారు. వృద్ధులు, దివ్యాంగులు మధ్యాహ్నం 3-4 మధ్య సీతమ్మవారి పాదాల వద్దకు వస్తే ప్రత్యేక వాహనాలలో కొండపైకి తరలించి సులభంగా దర్శనం కల్పిస్తామన్నారు. ఉత్సవాలలో భక్తులకు లిఫ్ట్‌లు వాడొద్దని పోలీసుల సూచన మేరకు అందరికీ ఘాట్ రోడ్డు మీదుగానే దర్శనం కల్పిస్తామని EO చెప్పారు.