News September 21, 2025
లా విద్యార్థులకు విజయవాడలో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం

APCRDA కార్యాలయం నుంచి ఇంటర్న్‌షిప్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్న్‌షిప్ చేసేందుకు 2025లో లా కోర్సు పూర్తి చేసినవారు, ఫైనలియర్ LLB చదివేవారు ఈ నెల 23లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని CRDA కమిషనర్ కన్నబాబు తెలిపారు. దరఖాస్తు చేసినవారిలో ఇద్దరిని ఎంపిక చేస్తామని, వివరాలకు https://crda.ap.gov.in/ వెబ్‌సైట్‌లోని కెరీర్స్ ట్యాబ్ చూడాలని సూచించారు.
Similar News
News September 21, 2025
KNR: పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. బంగారం కాజేసి

పెళ్లి చేసుకుంటానని యువతిని మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు KNR వన్ టౌన్ SI రాజన్న తెలిపారు. శివసాయి అనే యువకుడు ఓ యువతిని పరిచయం చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమె దగ్గర నుంచి 2 తులాల బంగారు చైన్‌ను తీసుకున్నాడు. అంతేగాక ఇటీవల యువతి ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టే ప్రయత్నం చేయగా యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
News September 21, 2025
నెక్లెస్ రోడ్: డ్రగ్స్ రహిత భారత్ కోసం 3K రన్

నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించిన నమో యువ 3K రన్‌లో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. యువతలో డ్రగ్స్ మత్తు ప్రభావంపై అవగాహన కల్పించి, డ్రగ్స్ రహిత దేశంగా భారత్‌ను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువతలో స్ఫూర్తి నింపేలా ఈ రన్ ఉత్సాహంగా సాగింది. నగరంలోని యువకులు పెద్దయెత్తున పాల్గొన్నారు.
News September 21, 2025
సిరిసిల్ల: మైనారిటీల కోసం మరో 2 పథకాలు..!

మైనారిటీ మహిళల సంక్షేమానికి ప్రభుత్వం <<17777841>>మరో 2 పథకాలు<<>> ప్రవేశపెట్టింది. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన ద్వారా వితంతువులు, విడాకులు పొందినవారు, అనాథలు, అవివాహిత మహిళలకు రూ.50వేల ఆర్థిక సాయం అందించనుంది. రేవంతన్నా కా సహారా పథకం కింద దూదేకుల ముస్లింలకు మోపెడ్‌లు, బైక్‌లు పంపిణీ చేయనుంది. ఆసక్తిగలవారు OCT 6 వరకు OBMMS పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి భారతి తెలిపారు. SHARE.