News September 21, 2025
ఎన్టీఆర్: డిగ్రీ పరీక్షల షెడ్యూల్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ (KRU) పరిధిలోని కళాశాలల్లో డిగ్రీ (హానర్స్) విద్యార్థులు రాయాల్సిన 3,5,7వ రెగ్యులర్ & సప్లిమెంటరీ సెమిస్టర్ థియరీ పరీక్షలను నవంబర్ 17 నుంచి నిర్వహిస్తామని KRU అధ్యాపక వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 24 నుంచి OCT 10వ తేదీ లోపు ఎలాంటి ఫైన్ లేకుండా, 21లోపు రూ.200 ఫైన్‌తో ఫీజు చెల్లించవచ్చని, వివరాలకు https://kru.ac.in/ చూడాలని KRU అధ్యాపకులు సూచించారు.
Similar News
News September 21, 2025
నగరవాసులకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ముఖ్య విజ్ఞప్తి

దసరా శరన్నవరాత్రుల నేపథ్యంలో కలెక్టర్ లక్ష్మీశా నగరవాసులకు ముఖ్య విజ్ఞప్తి చేశారు. ఇంద్రకీలాద్రి వద్ద రద్దీ ఎక్కువగా ఉండే సమయాలలో అనవసరంగా ఆ మార్గాలలో ప్రయాణించవద్దని ఆయన కోరారు. నగరం పరిశుభ్రంగా ఉండేందుకు సహకరించాలని.. ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలలో నగరవాసులు.. భక్తులకు స్వచ్చందంగా సేవ చేసే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు.
News September 21, 2025
పత్తిలో పూత, కాయలు రాలిపోతున్నాయా?

పత్తి పంట నీటి ముంపునకు గురైనప్పుడు పూత, పిందె, కాయలు రాలిపోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటప్పుడు ముందుగా పొలంలోని నీటిని తీసివేయాలి. ఎండ ఉన్న సమయంలో ఎకరాకు 25 కేజీల యూరియా, 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ బూస్టర్ డోస్‌గా వేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. అలాగే లీటరు నీటికి 5-10 గ్రా. పొటాషియం నైట్రేట్ పిచికారీ చేస్తే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.
<<-se>>#COTTON<<>>
News September 21, 2025
వారు VIP స్లాట్‌లోనే దర్శనానికి రావాలి: దుర్గగుడి EO

దసరా ఉత్సవాలలో దర్శనానికి వచ్చే దాతలు VIP స్లాట్‌లోనే దర్శనానికి రావాలని దుర్గగుడి EO శీనా నాయక్ చెప్పారు. ఉదయం 7-9, మధ్యాహ్నం 3-5 గంటల మధ్యలోనే దాతలు వారి కార్డు తీసుకుని దర్శనానికి రావాలన్నారు. కేశఖండన శాల, కొబ్బరికాయలు కొట్టే ప్రాంతంలో భక్తుల నుంచి డబ్బులు వసూలు చేయకుండా CC కెమెరాలతో పర్యవేక్షిస్తామని, డబ్బు తీసుకుంటే భక్తులు ఫిర్యాదు చేయవచ్చన్నారు.