News September 21, 2025

కొత్త వారికే H1B వీసా ఫీజు పెంపు: వైట్‌హౌస్ సెక్రటరీ

image

H1B వీసా <<17767574>>ఫీజు<<>> పెంపుపై వైట్‌హౌస్ సెక్రటరీ, ట్రంప్ సలహాదారు కరోలిన్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఈ వీసాలు ఉండి దేశం వెలుపల ఉంటే తిరిగి ప్రవేశించేందుకు ఏమీ ఛార్జ్ చేయట్లేదని చెప్పారు. వీసాదారులు ఎప్పటిలాగే దేశం విడిచినా, తిరిగొచ్చినా వారిపై కొత్త రూల్స్ ప్రభావం ఉండదని తెలిపారు. కొత్తగా వీసా తీసుకునే వారికే ఇది వర్తిస్తుందని తెలిపారు. ఇది వార్షిక ఫీజు కాదని, మొత్తం ఒకేసారి చెల్లించాల్సి ఉంటుందన్నారు.

Similar News

News September 21, 2025

గర్భిణులకు బార్లీ సురక్షితమేనా?

image

బార్లీ వాటర్‌ను తీసుకుంటే ప్రెగ్నెన్సీలో వచ్చే అనేక సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారిస్తుంది. కొందరిలో వికారం, గ్యాస్ సమస్యలను కూడా తగ్గిస్తుంది. డెలివరీ తర్వాత బ్రెస్ట్ మిల్క్‌ను పెంచడంలో బార్లీ సహాయపడుతుంది. రోజుకి 1-2 గ్లాసుల బార్లీ నీరు తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే విరేచనాలు, అలెర్జీ, రక్తస్రావం, సైనస్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

News September 21, 2025

పాడిపశువుల్లో కురమ జ్వరానికి ఆయుర్వేద చికిత్స

image

కురమ జ్వరం సోకిన పశువుకు రాగి జావ, తాటి కల్లును తాగించాలి. ఎండు ఖర్జూర కాయలను నీటిలో నానబెట్టి ఆవుకు తాగించాలి. కాకర ఆకులు, బెల్లం కలిపి నూరి పశువుకు తినిపించాలి. 100 గ్రాముల తిప్ప తీగ రసాన్ని 250 గ్రాముల మంచి నూనెలో కలిపి ఆవుకు తాగించాలి. తిప్ప తీగ కాడలు దండగా చేసి ఆవు మెడలో వేసి.. ఆ ఆకుల రసాన్ని మంచినూనెలో కలిపి జ్వరంతో బాధపడుతున్న ఆవు కాళ్లకు పట్టించాలని వెటర్నరీ నిపుణులు రాంబాబు సూచించారు.

News September 21, 2025

కత్రినా కైఫ్ బేబీ బంప్.. ఫొటో వైరల్

image

బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా కత్రినా బేబీ బంప్‌తో ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బేబీ బంప్‌తో ఆమె ఫొటో షూట్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ లేదా నవంబర్‌లో ఆమె బిడ్డకు జన్మనివ్వనున్నట్లు సమాచారం. కాగా 2021 డిసెంబర్ 9న విక్కీ, కత్రినా రాజస్థాన్‌లో వివాహం చేసుకున్నారు.