News September 21, 2025

ఎంగిలి పూల బతుకమ్మ.. ఏ నైవేద్యం పెట్టాలంటే?

image

బతుకమ్మ పండుగ మొదటి రోజును ‘ఎంగిలి పూల బతుకమ్మ’ అని పిలుస్తారు. ఈ రోజున నైవేద్యంగా నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి ప్రత్యేకమైన ప్రసాదం తయారు చేస్తారు. ఈ ప్రసాదాన్ని గౌరీ దేవికి సమర్పిస్తారు. ఇది పితృపక్షం మహాలయ అమావాస్య రోజున వస్తుంది. కాబట్టి పూర్వీకులకు తర్పణాలు వదిలి, ఆ తర్వాత ఈ పూజ చేస్తారు. బతుకమ్మ ఆటపాటలు పూర్తయ్యాక, ఈ ప్రసాదాన్ని అందరూ పంచుకుంటారు.

Similar News

News September 21, 2025

సా.5 గంటలకు మోదీ ప్రసంగం

image

ఈ సాయంత్రం 5 గం.కు ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రధాని ఏం చెబుతారనే దానిపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అర్ధరాత్రి నుంచి జీఎస్టీ అమల్లోకి రానున్న నేపథ్యంలో దానిపై ఏదైనా ప్రకటన చేస్తారా? లేదా అమెరికా H1B వీసాలపై మాట్లాడతారా? అనేది చూడాలి.

News September 21, 2025

పాడి పశువుల్లో కురమ జ్వరంతో నష్టాలు

image

పశువులకు అనేక రకాల సీజనల్ వ్యాధులు వస్తుంటాయి. వర్షాకాలంలో బలిష్టమైన ఆంబోతులు, ఎద్దులు, ఆవులకు కురమ జ్వరం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి పశువులో 3 రోజులు మాత్రమే ఉంటుంది. అయినప్పటికీ.. ఈ సమయంలో పశువులు బాగా నీరసించిపోతాయి. పాల దిగుబడి దాదాపు 80% వరకు తగ్గిపోతుంది. కురమ జ్వరం లక్షణాలు, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వెటర్నరీ నిపుణులు రాంబాబు కొన్ని సూచనలు చేశారు. అవేంటో చూద్దాం.

News September 21, 2025

పాడి పశువుల్లో కురమ జ్వరం లక్షణాలు

image

వైరల్ ఫీవర్ కురమ సోకితే పశువు తీవ్రమైన జ్వరంతో బాధపడుతుంది. కాళ్లు పట్టేయడం, పడుకొని లేవలేకపోవటం, కదలకుండా ఉండటం వంటి లక్షణాలు పశువుల్లో కనిపిస్తాయి. దీంతో పాటు పశువుల్లో వణుకు, చెవులు వాలేసి ఉండటం, గురక పెట్టడం, పళ్లు నూరడం, నెమరు వేయకపోవటం, ఆకలి లేకపోవటం, మూలగడం, గొంతు నొప్పి, చొంగ పడటం, కుంటడం, కీళ్ల నొప్పులతో పాటు కండరాల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ముక్కు, కళ్ల నుంచి నీరు వస్తుంది.