News September 21, 2025
ఏసీల ధరలు రూ.4,500 వరకు తగ్గింపు

GST శ్లాబుల మార్పుతో ఏసీలు, డిష్ వాషర్ల ధరలను తగ్గిస్తున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. ఏసీలపై సగటున రూ.4,500, డిష్ వాషర్లపై రూ.8వేల వరకు రేట్లు తగ్గిస్తున్నట్లు వోల్టాస్, డైకిన్, గోద్రేజ్, పానాసోనిక్, Haier తదితర కంపెనీలు ప్రకటించాయి. LG 1.5 టన్ ఇన్వర్టర్ స్ప్లిట్ AC ధర రూ.3,600 తగ్గింది. డైకిన్ 1 టన్ 3 స్టార్ ఏసీ ధర రూ.50,700 నుంచి రూ.46,730కి తగ్గింది. రేపటి నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి.
Similar News
News September 21, 2025
మోదీని కలిశా కానీ మాట్లాడలేదు: ప్రకాశ్ రాజ్

ప్రధాని మోదీపై నిప్పులు చెరిగే సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘నేను ఎయిర్‌పోర్టులో ఆయన్ను కలిశాను. కానీ మాట్లాడలేదు’ అని మోదీ కటౌట్ ఎదురుగా తీసుకున్న ఫొటోను షేర్ చేశారు. ‘మోదీని కలిసేంత కెపాసిటీ మీకు లేదు. ఇదే ఎక్కువ’ అని కొందరు ప్రకాశ్ రాజ్‌పై సెటైర్లు వేస్తున్నారు. ‘మోదీ టెలిప్రాంప్టర్ లేకుండా మాట్లాడలేరు. మీతో అసలే మాట్లాడరు’ అని మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు.
News September 21, 2025
చిట్టి తల్లీ సీటు ఇప్పిస్తా.. నిశ్చింతగా చదువుకో: మంత్రి లోకేశ్

AP: KGBVలో సీటు రాకపోవడంతో కర్నూల్(D) బూదూరుకు చెందిన జెస్సీ అనే బాలిక పత్తి పొలంలో పనికి వెళ్తోందన్న మీడియా కథనంపై మంత్రి లోకేశ్ స్పందించారు. ‘అధికారులతో మాట్లాడాను. చిట్టి తల్లీ KGBVలో నీకు సీటు వస్తుంది. నిశ్చింతగా చదువుకో. పరిస్థితులేవైనా పుస్తకాలు, పెన్ను పట్టాల్సిన చేతులు పత్తి చేలో మగ్గిపోవడం బాధాకరం. విద్యకు పిల్లల్ని దూరం చేయొద్దని తల్లిదండ్రుల్ని వేడుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.
News September 21, 2025
సా.5 గంటలకు మోదీ ప్రసంగం

ఈ సాయంత్రం 5 గం.కు ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రధాని ఏం చెబుతారనే దానిపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అర్ధరాత్రి నుంచి జీఎస్టీ అమల్లోకి రానున్న నేపథ్యంలో దానిపై ఏదైనా ప్రకటన చేస్తారా? లేదా అమెరికా H1B వీసాలపై మాట్లాడతారా? అనేది చూడాలి.