News September 21, 2025
40 గుడుంబా కేసులు నమోదు: MNCL CI

మంచిర్యాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటుసారా అరికట్టేందుకు ఈ నెల 30 వరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్లు సీఐ గురవయ్య తెలిపారు. గత నవంబర్ 2024 నుంచి ఇప్పటి వరకు నిర్వహించిన స్పెషల్ తనిఖీల్లో మొత్తం 40 గుడుంబా కేసులు నమోదు చేసినట్లు సీఐ గురువయ్య తెలిపారు. 38 మందిని పట్టుకుని చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నామన్నారు. 44 మందిని తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News September 21, 2025
టంగుటూరు: 80 క్వింటాళ్ల లోగ్రేడ్ పొగాకు సీజ్

విజిలెన్స్ అధికారి హేమంత్ కుమార్ శనివారం తెల్లవారుజామున 16 లక్షల విలువైన 80 క్వింటాళ్ల లోగ్రేడ్ పొగాకును అక్రమంగా తరలిస్తున్న లారీని పట్టుకున్నట్లు తెలిపారు. పొదిలి నుంచి చిలకలూరిపేట వెళ్తుండగా జాతీయ రహదారిపై లారీని అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా పొగాకు కొనుగోలు చేసే వ్యాపారులు తీరు మార్చుకోకపోతే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే జిల్లాలో 50 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
News September 21, 2025
HYD: క్యాప్స్ గోల్డ్‌లో 5వ రోజు ఐటీ సోదాలు

క్యాప్స్ గోల్డ్‌లో 5వ రోజూ ఐటీ సోదాలుజరుగుతున్నయి. సికింద్రాబాద్‌లోని క్యాప్స్ గోల్డ్ కార్యాలయం సీజ్ చెయ్యగా ల్యాప్‌టాప్‌లు, పెన్‌డ్రైవ్‌లు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. చందా శ్రీనివాస్, అభిషేక్‌ను ఐటీ అధికారులు విచారించారు. హైదరాబాద్, గుంటూరు, విజయవాడలో బంధువులను బినామీలుగా ఉంచినట్లు అధికారులు గుర్తించారు.
News September 21, 2025
KNR: ‘ఒక్కేసి పువ్వేసి’.. ఒక్కో రోజు.. తీరొక్క రూపంలో

ఉమ్మడి కరీంనగర్‌లో బతుకమ్మ సంబరాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో మహిళలు ఒక్కోరోజు ఒక్కో రూపంలో తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి పూజిస్తారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, 2వ రోజు అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలిగిన బతుకమ్మ, 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్నెముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మతో వేడుకలు ముగుస్తాయి.