News September 21, 2025
తుని: క్రేన్ ఢీకొని వ్యక్తి మృతి

తుని రైల్వే ఫ్లైఓవర్ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్‌పై నడుచుకుంటూ వెళ్తున్న పాయకరావుపేట వాసి ప్రసాద్ (28)ను వేగంగా వచ్చిన క్రేన్ ఢీకొంది. ఈ ఘటనలో ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పాయకరావుపేటలో సువార్తకుడుగా జీవనం సాగిస్తున్నట్లు బంధువులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 21, 2025
పాతబస్తీ పనుల్లో వేగం పెంచండి: మెట్రో MD

HYD మెట్రో రైల్ ప్రాజెక్టుపై HMRL ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. మెట్రో మొదటి దశ, ముఖ్యంగా పాత నగరంలో పనులను వేగవంతం చేయాలని, సవాళ్లను అధిగమించేందుకు ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మెట్రో 2వ దశ ప్రాజెక్టునూ సమీక్షిస్తూ, సీఎం మార్గదర్శనంలో అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
News September 21, 2025
ఆరోగ్యశ్రీతో NIMSలో ఉచిత గుండె శస్త్రచికిత్సలు

NIMSలో సెప్టెంబర్ 15 నుంచి 19 వరకు 4వ పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీ శిబిరం విజయవంతంగా పూర్తైంది. డా.రమణ, డా.ఎం.అమరేశ్ రావు ఆధ్వర్యంలో 22 మంది చిన్నారులకు క్లిష్టమైన గుండె ఆపరేషన్లు చేశారు. ఇందులో రష్యా, యూకే, భారత్‌కు చెందిన వైద్య నిపుణులు కలిసి సేవలందించారు. 500 మందికిపైగా రోగులు వైద్యపరీక్షలు చేయించుకున్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చికిత్సలు అందించారు.
News September 21, 2025
KNR: నేటితో ‘పెత్తరమాస’ తర్పణాలు లాస్ట్..!

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెత్తరమాస (పెద్దల అమావాస్య) ఈనెల 7న ప్రారంభమైంది. ఈ సందర్భంగా పక్షం రోజులు తండ్రి, తాత, ముత్తాతలు, ఇతరులను తలుచుకొని ఆరాధిస్తారు. వారి సంతానం నైవేద్యాలను సమర్పిస్తుంది. ఇలా చేస్తే తర్వాతి తరాలవారిపై పూర్వీకుల దీవెనలు ఉంటాయని మన పెద్దలు చెబుతుంటారు. కాగా, నేటితో ఈ తర్పణాల కార్యక్రమాలు ముగియనుండగా సాయంత్రం నుంచి బతుకమ్మ వేడుకలు వాడవాడలా ఘనంగా ప్రారంభం కానున్నాయి.