News September 21, 2025
కోలలపూడి వద్ద ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి

మార్టూరు (M) కోలలపూడి జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుక్కను తప్పించబోయి కారు డివైడర్‌ను ఢీకొంది. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. తిరుపతి నుంచి పిఠాపురంలోని దేవాలయానికి పిత్రుదేవతలకు పిండప్రధానం చేయడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు లక్ష్మణ్ (70), సుబ్బాయమ్మ (65) , హేమంత్ (25) గా సమాచారం. మరో ఇద్దరు గాయపడ్డారు.
Similar News
News September 21, 2025
ఆరోగ్యశ్రీతో NIMSలో ఉచిత గుండె శస్త్రచికిత్సలు

NIMSలో సెప్టెంబర్ 15 నుంచి 19 వరకు 4వ పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీ శిబిరం విజయవంతంగా పూర్తైంది. డా.రమణ, డా.ఎం.అమరేశ్ రావు ఆధ్వర్యంలో 22 మంది చిన్నారులకు క్లిష్టమైన గుండె ఆపరేషన్లు చేశారు. ఇందులో రష్యా, యూకే, భారత్‌కు చెందిన వైద్య నిపుణులు కలిసి సేవలందించారు. 500 మందికిపైగా రోగులు వైద్యపరీక్షలు చేయించుకున్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చికిత్సలు అందించారు.
News September 21, 2025
KNR: నేటితో ‘పెత్తరమాస’ తర్పణాలు లాస్ట్..!

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెత్తరమాస (పెద్దల అమావాస్య) ఈనెల 7న ప్రారంభమైంది. ఈ సందర్భంగా పక్షం రోజులు తండ్రి, తాత, ముత్తాతలు, ఇతరులను తలుచుకొని ఆరాధిస్తారు. వారి సంతానం నైవేద్యాలను సమర్పిస్తుంది. ఇలా చేస్తే తర్వాతి తరాలవారిపై పూర్వీకుల దీవెనలు ఉంటాయని మన పెద్దలు చెబుతుంటారు. కాగా, నేటితో ఈ తర్పణాల కార్యక్రమాలు ముగియనుండగా సాయంత్రం నుంచి బతుకమ్మ వేడుకలు వాడవాడలా ఘనంగా ప్రారంభం కానున్నాయి.
News September 21, 2025
H1B ఫీజు రూల్స్.. పూర్తి వివరాలు

*కొత్తగా H1B కోసం అప్లై చేసుకునే వారికే వర్తిస్తుంది. (అంటే 2026 నుంచి వీసా పిటిషన్ ఫైల్ చేసే వారికి)
*కొత్త వీసా కోసం కంపెనీలు లక్ష డాలర్లు ఒకేసారి చెల్లించాలి. ప్రతి ఏడాది కట్టాల్సిన అవసరం లేదు
*ప్రస్తుతం H1B వీసా ఉన్నవారికి ఇది వర్తించదు
*వీసా రెన్యూవల్స్, 2025 లాటరీ విన్నర్లకూ మినహాయింపు
*ప్రస్తుతం వీసా ఉన్నవారు ఇతర దేశాలకు వెళ్లవచ్చు. తిరిగి అమెరికాకు వచ్చేటప్పుడు ఎలాంటి అడ్డంకులు ఉండవు.