News September 21, 2025
వరంగల్: పితృ అమావాస్యనే పెత్రమాస..!

బతుకమ్మ పండుగ ప్రారంభమయ్యే తొలి రోజున పెత్రమాస అంటే పితృ అమావాస్యగా పిలుస్తారు. దీనినే మహాలయ అమావాస్యగా కూడా చెబుతారు. వరంగల్ జిల్లా వాసుల కుటుంబాల్లో చనిపోయిన వ్యక్తులను గుర్తుచేసుకొని వారికి తర్పణం లాంటి కార్యక్రమాల్లో భాగంగా వేద పండితులకు బియ్యం, పప్పు, ఉప్పు సామాగ్రి ఇచ్చి తమ పితృ దేవుళ్లకు ఇచ్చినట్లుగా వారి పేర్లను చదివిపిస్తారు. ఈ రోజునే పితృదేవతలు కూడా భూమి మీదకు వస్తారనే నమ్ముతారు.
Similar News
News September 21, 2025
MLG: సెల్ఫీ దిగుతూ కిందపడి యువకుడు మృతి

వాజేడు మం.లో విషాదం నెలకొంది. కొంగాల జలపాతం సందర్శనకు 8 మంది స్నేహితులతో వెళ్లిన ఓ యువకుడు గల్లంతై మరణించినట్లు స్థానికులు తెలిపారు. జలపాతం వద్ద సెల్ఫీ దిగేందుకు గుట్టపైకి ఎక్కిన యువకుడు కాలుజారి కిందపడ్డట్లు చెప్పారు. ఇది తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కాగా, కొంగాల జలపాతానికి అనుమతి లేకున్నా అధికారుల కళ్లుగప్పి కొందరు సందర్శనకు వెళ్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
News September 21, 2025
స్టూడెంట్స్.. టెన్షన్ వద్దు!

H1B వీసా ఫీజులను లక్ష డాలర్లకు <<17779352>>పెంచడంతో<<>> అమెరికాలో మాస్టర్స్ చేస్తున్న భారత విద్యార్థులు ఉద్యోగాలు రావని ఆందోళన చెందుతున్నారు. అయితే అమెరికాకు F1 వీసాపై వెళ్లిన విద్యార్థులు చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం వస్తే 12 నెలల పాటు అక్కడ ఉండవచ్చు. మరో 24 నెలలు OPT ఎక్స్‌టెన్షన్ ఫెసిలిటీ ఉంటుంది. అంటే చదువు పూర్తయిన మూడేళ్ల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ లోగా ట్రంప్ ప్రభుత్వం మారి H1B రూల్స్ మారొచ్చు.
News September 21, 2025
వేములవాడలో ‘బతుకమ్మ.. 7 రోజులే’!

ఉమ్మడి KNRలో నేటి నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభం కానున్నయి. సాధారణంగా అన్నిచోట్ల ఆశ్వయుజ మాసం శుద్ధ పాడ్యమి నుంచి 9 రోజుల పాటు బతుకమ్మను జరుపుకుంటారు. కానీ, రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా వేములవాడలో మాత్రం 7 రోజులే ఈ వేడుకలను నిర్వహిస్తారు. ఇక్కడ ఏడో రోజైన వేపకాయల బతుకమ్మను సద్దుల బతుకమ్మగా జరుపుకుంటారు. కాగా, ఇక్కడి ఆడపడుచులు పుట్టింటితో పాటు మెట్టినింటిలో బతుకమ్మను ఆడటం వారి అదృష్టంగా భావిస్తారు.