News September 21, 2025

90 శాతం సబ్సిడీతో పసుపు విత్తనాలు, పరికరాలు

image

AP: పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఐటీడీఏ పరిధిలో పసుపు సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పసుపు విత్తనాలు, సాగు పరికరాలను 90 శాతం సబ్సిడీపై అందించనుంది. కేవలం 10 శాతం రైతులు చెల్లించాలి. ఇందుకోసం ప్రభుత్వం రూ.7.93 కోట్లు ఖర్చు చేయనుంది. కాగా ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తే బాగుంటుందని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Similar News

News September 21, 2025

జన్‌జీ ఉద్యమం వస్తుందన్న KTR.. బండి సంజయ్ రిప్లై ఇదే!

image

TG: నేపాల్ తరహాలో INDలోనూ జన్‌జీ ఉద్యమం రావొచ్చన్న <<17778245>>KTR కామెంట్స్‌పై<<>> కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ‘నేపాల్ జన్‌జీ నెపోటిజంపై పోరాడారు. తెలంగాణ జన్‌జీ వారి కంటే ముందే KCR, ఆయన పిల్లల్ని పక్కన పెట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో BRSకు బిగ్ జీరో ఇచ్చారు. ఫ్యామిలీ రూల్‌ను అంతం చేశారు’ అని ట్వీట్ చేశారు. KTRను నెపో కిడ్‌గా పేర్కొంటూ NDTV-YUVA కాన్‌క్లేవ్‌లో ఆయనకు యువత రియాలిటీని చూపించిందన్నారు.

News September 21, 2025

చంద్రబాబు వల్లే పోలవరం ఆలస్యం: బుగ్గన

image

AP: పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి చంద్రబాబే కారణమని వైసీపీ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. కాఫర్ డ్యామ్ పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ ఎలా కట్టారని ప్రశ్నించారు. పోలవరానికి శంకుస్థాపన చేసి, అన్ని అనుమతులు తెచ్చింది వైఎస్సారేనని అన్నారు. హంద్రీ-నీవాపైనా చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని, అందులో ఎక్కువ పనులు చేసింది రాజశేఖర్ రెడ్డేనని చెప్పారు.

News September 21, 2025

స్టూడెంట్స్.. టెన్షన్ వద్దు!

image

H1B వీసా ఫీజులను లక్ష డాలర్లకు <<17779352>>పెంచడంతో<<>> అమెరికాలో మాస్టర్స్ చేస్తున్న భారత విద్యార్థులు ఉద్యోగాలు రావని ఆందోళన చెందుతున్నారు. అయితే అమెరికాకు F1 వీసాపై వెళ్లిన విద్యార్థులు చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం వస్తే 12 నెలల పాటు అక్కడ ఉండవచ్చు. మరో 24 నెలలు OPT ఎక్స్‌టెన్షన్ ఫెసిలిటీ ఉంటుంది. అంటే చదువు పూర్తయిన మూడేళ్ల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ లోగా ట్రంప్ ప్రభుత్వం మారి H1B రూల్స్ మారొచ్చు.