News April 5, 2024
రెపో రేటు అంటే ఏంటి? మనకేం లాభం?

రెపో రేటును 6.5%గా కొనసాగిస్తున్నట్లు RBI తాజాగా ప్రకటించింది. బ్యాంకులు RBI నుంచి తీసుకున్న లోన్లపై విధించే వడ్డీ రేటునే రెపో రేట్ అంటారు. దీనిని స్వల్పకాలిక వడ్డీ రేటు అని కూడా అంటారు. దేశంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రెపో రేటును RBI నిర్ణయిస్తుంది. రెపో రేటు తగ్గిస్తే బ్యాంకులు ప్రజలకు తక్కువ వడ్డీ రేట్లకే లోన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది.
Similar News
News April 23, 2025
FY26లో 2-4% పెరగనున్న సిమెంట్ ధరలు!

దేశీయంగా ఈ ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ డిమాండ్ 6.5-7.5% పెరగొచ్చని CRISIL అంచనా వేసింది. రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయనే అంచనాలతో గ్రామీణ ప్రాంతాల్లో గృహాల నిర్మాణం ఊపందుకుంటుందని తెలిపింది. అలాగే మౌలిక సదుపాయాల వ్యయం పెరగడంతో సిమెంట్ డిమాండ్ అధికమవుతుందని వెల్లడించింది. మొత్తం డిమాండ్‌లో 12 రాష్ట్రాల వాటా 63-65 శాతం ఉండొచ్చని వివరించింది. దీనివల్ల సిమెంట్ ధరలు 2-4% పెరగొచ్చని పేర్కొంది.
News April 23, 2025
పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై కోర్టుకెక్కనున్న మాజీ కోచ్

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జాసెన్ గిలెస్పీ పాకిస్థాన్ జట్టుకు గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు కోచ్‌గా పనిచేశారు. తనకు ఇవ్వాల్సిన జీతాన్ని పాకిస్థాన్ బకాయి పెట్టిందని ఆయన తాజాగా ఆరోపించారు. దానిపై కోర్టును ఆశ్రయించనున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన కాంట్రాక్టును ఉల్లంఘించి నోటీసులు కూడా ఇవ్వకుండా అర్ధాంతరంగా పదవి నుంచి తప్పుకొన్నారని, తామేమీ బకాయిపడలేదని పీసీబీ తెలిపింది.
News April 23, 2025
ఉగ్రదాడి.. విశాఖ వాసి గల్లంతు?

AP: జమ్మూకశ్మీర్ పహల్‌గామ్‌లోని బైసరీన్ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడి ఘటనలో విశాఖ వాసి గల్లంతైనట్లు సమాచారం. రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి ఇటీవల అక్కడికి టూర్ వెళ్లారు. అయితే దాడి తర్వాత ఆయనకు బంధువులు ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదు. దీంతో చంద్రమౌళి భార్య పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆయన ఆచూకీ తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.