News September 21, 2025

మండోదరి పాత్రలో పూనమ్.. వ్యతిరేకిస్తున్న BJP, VHP!

image

ఢిల్లీలో జరిగే ‘రామ్‌లీల’ ఈవెంట్‌లో రావణుడి భార్య మండోదరి పాత్రలో నటించేందుకు పూనమ్ పాండేను తీసుకోవడంపై స్థానిక BJP, VHP నేతలు అభ్యంతరం తెలిపారు. ఆమెను మరొకరితో రీప్లేస్ చేయాలని లవ్‌కుశ్ రామ్‌లీల కమిటీని కోరారు. పూనమ్ తన ఫొటోలు, వీడియోలతో ఎన్నో కాంట్రవర్సీలు క్రియేట్ చేశారని గుర్తుచేశారు. అయితే ఇందులో తమకు ఏ తప్పూ కనిపించలేదని, ప్రతి ఒక్కరూ అవకాశం పొందేందుకు అర్హులని కమిటీ ప్రెసిడెంట్ బదులిచ్చారు.

Similar News

News September 21, 2025

‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు అందుకున్న తెలుగువాళ్లు వీరే!

image

మోహన్‌లాల్‌‌ను ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ అవార్డు వరించిన నేపథ్యంలో గతంలో ఈ అవార్డు అందుకున్న తెలుగు వారెవరో తెలుసుకుందాం. BN రెడ్డి(1974) దక్షిణాది నుంచి ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తిగా నిలిచారు. తర్వాత LV ప్రసాద్(1982), B.నాగిరెడ్డి(1986), ANR(1990), రామానాయుడు(2009), K విశ్వనాథ్(2016) అందుకున్నారు. దక్షిణాదిలో వీరితో పాటు రజినీకాంత్, బాలచందర్, గోపాలకృష్ణన్, శివాజీ గణేషన్, రాజ్‌కుమార్‌కు దక్కింది.

News September 21, 2025

వరిలో సుడిదోమ విజృంభణ.. లక్షణాలు

image

* అధికంగా నత్రజని ఎరువులను వాడటం, పొలంలో ఎక్కువగా నీరు నిల్వచేయడం వల్ల సుడి దోమ విజృంభిస్తుంది.
* నేరుగా విత్తే పద్ధతిలో ఎక్కువ విత్తనాలను చల్లడం, పైరు తొలి దశలో పురుగు మందులను ఎక్కువగా వాడటంతో మిత్ర కీటకాల సంఖ్య తగ్గి దోమ తీవ్రత పెరుగుతుంది.
* దోమలు వరి మొదళ్ల వద్ద చేరి రసాన్ని పీల్చేస్తాయి. దీనివల్ల మొక్కలు పసుపు రంగులోకి మారి ఎండిపోతాయి. చివరగా తాలు గింజలు ఏర్పడి దిగుబడి తగ్గుతుంది.
<<-se>>#PADDY<<>>

News September 21, 2025

ALERT: ఇవాళ భారీ వర్షాలు

image

TG: ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు ఉ.8 గంటల వరకు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్ నగరంలో సాయంత్రం, రాత్రి వేళ్లలో వర్షాలు కురుస్తాయని వివరించింది.