News September 21, 2025

ఎల్కతుర్తి: ఎంగిలిపూల బతుకమ్మని ఎందుకు అంటారంటే?

image

బతుకమ్మని పేర్చేందుకు ఒకరోజు ముందే రకరకాల పువ్వులను సేకరించి వాటిని నీటిలో వేసి నిల్వ చేస్తారు. ఇలా ఒకరోజు నిద్ర చేసిన పువ్వులతో బతుకమ్మని మొదటి రోజున పేరుస్తారు. అందుకే కొన్ని ప్రాంతాల్లో ఎంగిలిపూల బతుకమ్మని.. మరికొన్ని ప్రాంతాల్లో తిన్న తర్వాత బతుకమ్మని పిలుస్తారు. బతుకమ్మ అందమైన పూల సంబరం. ఈరోజు నువ్వులు, బియ్యం పిండి, నూకల పిండి కలిపి నైవేద్యం సమర్పిస్తారు.

Similar News

News September 21, 2025

KNR: ఒక్కోమహిళకు రూ.50వేలు.. రూ.లక్ష స్కూటీ!

image

ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన కింద వ్యాపారాల కోసం ఒక్కోమహిళ రూ.50,000 పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని KNR మైనారిటీ సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లు కోరారు. అలాగే రేవంతన్న కా సహారా స్కీంలో భాగంగా అందించే రూ.లక్ష విలువగల మోపెడ్(స్కూటీ) వాహనాలు పొందేందుకు tgobmms.cgg.gov.in ద్వారా ఆన్లైన్లో APPLY చేసుకోవాలన్నారు. ఇందుకు చివరితేదీ OCT 6 అని, మరిన్ని వివరాలకు 0878-2957085ను సంప్రదించాలన్నారు. #SHARE IT.

News September 21, 2025

దుర్గగుడిలో భక్తులకు క్యూఆర్ కోడ్ సేవలు: కలెక్టర్

image

దసరా శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గగుడికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అమ్మవారి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశామని కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. రైల్వేస్టేషన్, బస్టాండ్, హోల్డింగ్ ప్రాంతాలు, 1.8కి.మీ పొడవున ఉన్న క్యూలైన్‌లలో ప్రతి 100 మీటర్లకు క్యూఆర్ కోడ్ పోస్టర్‌లు ఏర్పాటు చేశామన్నారు. భక్తులు ఈ కోడ్‌ స్కాన్ చేసి, ఉత్సవాల ఏర్పాట్లపై తమ అభిప్రాయాలను, సమస్యలను తెలియజేయవచ్చని చెప్పారు.

News September 21, 2025

అత్తా కోడళ్లకు ఎందుకు పడదంటే?

image

అత్తాకోడళ్లంటే ఒకే ఒరలో రెండు కత్తులని అందరూ భావిస్తారు. దీనికి కారణాలు అనేకం. భర్త తన సొంతం అని కోడలు అనుకుంటుంది. కొడుకును తన దగ్గర్నుంచి లాక్కున్నారని తల్లి అనుకుంటుంది. ఇద్దరి మధ్య ప్రేమ ఉండదు. సమాజం కోడలు ఎలా ఉండాలి అనేది ఒక ఫ్రేమ్ వర్క్‌లో చూస్తుంది. పోటీ తత్త్వం, అసూయ, ప్రాథమిక కారణాలు అని సైకాలజిస్ట్‌లు అంటున్నారు. అత్తా కోడళ్ల మధ్య ఓపెన్‌నెస్ ఉంటే చాలా సమస్యలు సమసిపోతాయని సూచిస్తున్నారు.