News September 21, 2025

గజ్వేల్: డెంగ్యూతో బాలుడి మృతి

image

డెంగ్యూతో బాలుడు మృతి చెందిన ఘటన గజ్వేల్ మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. కొడకండ్ల గ్రామానికి చెందిన ఎ.యశ్వంత్(11) డెంగ్యూతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గత వారం రోజులుగా హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న యశ్వంత్ శనివారం ఆరోగ్యం విషమించి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలుడి మరణంతో కుటుంబీకులు తీవ్రంగా దుఃఖిస్తున్నారు.

Similar News

News September 21, 2025

PDPL: కలెక్టర్‌పై ఆరోపణలు ఖండించాలి: శంకర్

image

PDPL కలెక్టర్‌పై నిరాధార ఆరోపణలను టీజ్యాక్ జిల్లా ఛైర్మన్ బొంకూరి శంకర్ తీవ్రంగా ఖండించారు. RGMలోని ఆశ్రమ పాఠశాల భూ కేటాయింపులో కలెక్టర్ డబ్బులు అడిగారని కొన్నివర్గాలు చేసిన ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. కలెక్టర్ ప్రజాసేవలో అంకితభావంతో పనిచేస్తుండగా, ఈ తరహా ఆరోపణలు ఉద్యోగుల మానసిక స్థితిని దెబ్బతీసే విధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాల అమలులో కలెక్టర్ పటిష్ఠంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.

News September 21, 2025

మరికొన్ని గంటల్లో పాకిస్థాన్‌తో మ్యాచ్.. భారత జట్టు అంచనా!

image

ఈరోజు రాత్రి 8 గంటలకు భారత్vsపాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభం కానుంది. స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయపడగా మ్యాచ్ ఆడటంపై అనిశ్చితి నెలకొనడంతో అతడి స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ లేదా హర్షిత్ రాణా వచ్చే ఛాన్స్ ఉందని NDTV తెలిపింది.
టీమ్ అంచనా: అభిషేక్ శర్మ, గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్/హర్షిత్ రాణా, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్

News September 21, 2025

ADB: దేశీ’దారు’లు తొక్కుతోంది..!

image

మహారాష్ట్రలో అతిగా తాగే దేశీదారు సరఫరా జిల్లాలోకి పాకుతోంది. సరిహద్దు మండలాలైన భీంపూర్, తాంసి, తలమడుగు, బేల, జైనథ్‌లకు ఈ అక్రమ మద్యం అధికంగా సరఫరా అవుతోంది. పోలీసులు తనిఖీలు నిర్వహించి, పట్టుకొని కేసులు పెడుతున్నా.. అక్రమ దందాను నిందితులు ఆపడం లేదు. నేరుగా రోడ్లపైనే తీసుకొస్తున్నారు. పోలీసులుంటే నాటు పడవల్లో పెన్ గంగా మీదుగా దాటించి, ఇక్కడికి సరఫరా చేస్తున్నారని ప్రజలు చెబుతున్నారు.