News September 21, 2025
వారు VIP స్లాట్‌లోనే దర్శనానికి రావాలి: దుర్గగుడి EO

దసరా ఉత్సవాలలో దర్శనానికి వచ్చే దాతలు VIP స్లాట్‌లోనే దర్శనానికి రావాలని దుర్గగుడి EO శీనా నాయక్ చెప్పారు. ఉదయం 7-9, మధ్యాహ్నం 3-5 గంటల మధ్యలోనే దాతలు వారి కార్డు తీసుకుని దర్శనానికి రావాలన్నారు. కేశఖండన శాల, కొబ్బరికాయలు కొట్టే ప్రాంతంలో భక్తుల నుంచి డబ్బులు వసూలు చేయకుండా CC కెమెరాలతో పర్యవేక్షిస్తామని, డబ్బు తీసుకుంటే భక్తులు ఫిర్యాదు చేయవచ్చన్నారు.
Similar News
News September 21, 2025
ప్రభాస్, ఎన్టీఆర్ తర్వాత తేజానే!

‘మిరాయ్’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న యంగ్ హీరో తేజా సజ్జ మరో రికార్డు సృష్టించారు. నార్త్ అమెరికాలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో $2.5M+ గ్రాస్ వసూళ్లు సాధించిన మూడో తెలుగు హీరోగా నిలిచారు. ప్రభాస్, తారక్ మాత్రమే ఉన్న ఈ లిస్టులో ఓ యంగ్ హీరో చేరడం సంచలనమేనని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అంతకుముందు తేజ నటించిన ‘హను-మాన్’ సినిమాకి కూడా $2.5M+ గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.
News September 21, 2025
GNT: మసకబారుతున్న ANU ప్రతిష్ట

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రతిష్ఠ రోజురోజుకు పడిపోతోంది. ఎంఎస్సీ బోటనీలో 88 మందికి 24 మందే ఉత్తీర్ణత సాధించగా, మీడియా మేనేజ్‌మెంట్‌లో నలుగురిలో ఇద్దరు మాత్రమే పాసయ్యారు. విద్యా అంశాలపై కాకుండా అధ్యాపకులు పరిపాలనపై దృష్టి పెట్టడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, ప్రభుత్వం సమర్థవంతమైన వీసీని నియమించాలని విద్యార్థులు కోరుతున్నారు. గతంలో కంటే యూనివర్సిటీ NIRF ర్యాంకింగ్ 24 స్థానాలు తగ్గింది.
News September 21, 2025
PDPL: ఇద్దరు యువకులపై కత్తిపోట్లు.. పోలీసుల దర్యాప్తు

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణం కృష్ణానగర్‌కు చెందిన కుమారస్వామితో పాటు భాస్కర్‌పై గుర్తుతెలియని వ్యక్తి శనివారం రాత్రి కత్తితో దాడి చేశాడు. ఇంటి వద్దనే ఈ ఘటన జరగడంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. తీవ్రంగా గాయపడిన కుమారస్వామి, భాస్కర్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.