News September 21, 2025

నగరవాసులకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ముఖ్య విజ్ఞప్తి

image

దసరా శరన్నవరాత్రుల నేపథ్యంలో కలెక్టర్ లక్ష్మీశా నగరవాసులకు ముఖ్య విజ్ఞప్తి చేశారు. ఇంద్రకీలాద్రి వద్ద రద్దీ ఎక్కువగా ఉండే సమయాలలో అనవసరంగా ఆ మార్గాలలో ప్రయాణించవద్దని ఆయన కోరారు. నగరం పరిశుభ్రంగా ఉండేందుకు సహకరించాలని.. ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలలో నగరవాసులు.. భక్తులకు స్వచ్చందంగా సేవ చేసే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు.

Similar News

News September 21, 2025

ప్రభాస్, ఎన్టీఆర్ తర్వాత తేజానే!

image

‘మిరాయ్’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న యంగ్ హీరో తేజా సజ్జ మరో రికార్డు సృష్టించారు. నార్త్ అమెరికాలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో $2.5M+ గ్రాస్ వసూళ్లు సాధించిన మూడో తెలుగు హీరోగా నిలిచారు. ప్రభాస్, తారక్ మాత్రమే ఉన్న ఈ లిస్టులో ఓ యంగ్ హీరో చేరడం సంచలనమేనని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అంతకుముందు తేజ నటించిన ‘హను-మాన్’ సినిమాకి కూడా $2.5M+ గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

News September 21, 2025

GNT: మసకబారుతున్న ANU ప్రతిష్ట

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రతిష్ఠ రోజురోజుకు పడిపోతోంది. ఎంఎస్సీ బోటనీలో 88 మందికి 24 మందే ఉత్తీర్ణత సాధించగా, మీడియా మేనేజ్‌మెంట్‌లో నలుగురిలో ఇద్దరు మాత్రమే పాసయ్యారు. విద్యా అంశాలపై కాకుండా అధ్యాపకులు పరిపాలనపై దృష్టి పెట్టడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, ప్రభుత్వం సమర్థవంతమైన వీసీని నియమించాలని విద్యార్థులు కోరుతున్నారు. గతంలో కంటే యూనివర్సిటీ NIRF ర్యాంకింగ్‌ 24 స్థానాలు తగ్గింది.

News September 21, 2025

PDPL: ఇద్దరు యువకులపై కత్తిపోట్లు.. పోలీసుల దర్యాప్తు

image

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణం కృష్ణానగర్‌కు చెందిన కుమారస్వామితో పాటు భాస్కర్‌పై గుర్తుతెలియని వ్యక్తి శనివారం రాత్రి కత్తితో దాడి చేశాడు. ఇంటి వద్దనే ఈ ఘటన జరగడంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. తీవ్రంగా గాయపడిన కుమారస్వామి, భాస్కర్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.