News September 21, 2025
సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే చర్యలు: కడప DEO

దసరా సెలవుల్లో ప్రైవేటు విద్యాసంస్థలు సెలవులు ఇవ్వకుండా తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవని కడప DEO శంషుద్దీన్ హెచ్చరించారు. ప్రైవేట్ యాజమాన్యాలు ప్రత్యేక తరగతులు, ట్యూషన్ల పేరుతో క్లాస్లు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందేనన్నారు.
Similar News
News September 28, 2025
కడప: జియాలజీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

యోగి వేమన విశ్వవిద్యాలయంలో పీజీ కళాశాలలో ఎమ్మెస్సీ ఎర్త్ సైన్స్ విభాగంలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ అప్లైడ్ జియాలజీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంచాలకులు లక్ష్మీప్రసాద్ తెలిపారు. ఈ కోర్సులో పట్టభద్రులైన విద్యార్థులకు మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. ఇంటర్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు ఇందుకు అర్హులన్నారు. ఆసక్తిగల విద్యార్థులు విశ్వవిద్యాలయానికి వచ్చి సంప్రదించాలన్నారు.
News September 28, 2025
సోషల్ మీడియా ఇన్ఫ్లూయర్స్తో ఎస్పీ నచికేత్ సమావేశం

కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ శనివారం 50 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లూయర్స్తో సమావేశం నిర్వహించారు. సైబర్ నేరాలు, రోడ్డు సేఫ్టీ, డ్రగ్స్ అనర్థాలపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ఇన్ఫ్లూయర్స్ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రీల్స్, పోస్టులు, కథనాలు సమాజ హితానికి ఉపయోగపడేలా రూపొందించాలి, హింస, కుల, మత వివేధాలను కలిగించే పోస్టులలు కనిపిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
News September 27, 2025