News September 21, 2025

దుర్గగుడికి తక్కువ సామానుతో రండి: కలెక్టర్

image

దసరా ఉత్సవాల సందర్భంగా దుర్గ గుడికి వచ్చే భక్తులు తక్కువ సామానుతో రావాలని NTR కలెక్టర్ లక్ష్మీశా కోరారు. భక్తులు తమ వ్యక్తిగత వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని, నిర్దేశించిన క్యూలైన్లలో మాత్రమే అమ్మవారి దర్శనానికి రావాలని ఆయన సూచించారు. వృద్ధులు, పసిపిల్లల తల్లిదండ్రులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News September 21, 2025

వెజైనల్​ ఇన్ఫెక్షన్స్‌తో ప్రెగ్నెన్సీకి ఇబ్బంది

image

మహిళల్లో వైట్​ డిశ్చార్జ్​ రంగు మారినా, వెజైనా పొడిబారి మంట, దురద వస్తూ స్పాటింగ్ కనిపిస్తున్నా వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లే. అయితే కొన్ని ఇన్ఫెక్షన్స్​ వల్ల ఫెలోపియన్​ ట్యూబ్స్​ బ్లాక్​ అవుతాయి. దాంతో పిండం గర్భాశయంలోకి వెళ్లదు. దాన్నే ఎక్టోపిక్​ ప్రెగ్నెన్సీ అంటారు. దీన్ని గుర్తించకపోతే ఫెలోపియన్​ ట్యూబ్స్ పగిలి ప్రాణాలకే ప్రమాదం. కాబట్టి ఏవైనా ఇన్ఫెక్షన్లు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

News September 21, 2025

కళాతపస్వి కె. విశ్వనాథ్ మన గుంటూరు వాసే

image

ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన కళాతపస్వి కె. విశ్వనాథ్ ఉమ్మడి గుంటూరు జిల్లా పెదపులివర్రులో జన్మించారు. ఆయన తీసిన చిత్రాలు శంకరాభరణం, సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం ప్రధామైనవి. 2016 లో ఆయన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నారు. 2022లో ఏపీ ప్రభుత్వం ద్వారా జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు.

News September 21, 2025

గాజులరామరంలో పేదల ఇళ్లు కూల్చం: రంగనాథ్

image

గాజులరామారంలో భారీగా కబ్జాలపై హైడ్రా కమీషనర్ రంగనాథ్ స్పష్టత ఇచ్చారు. 317 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నేతలు, అధికారులు ఆక్రమించిన భూములను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటుందన్నారు. పేదలఇళ్లను కూల్చొద్దని ఫీల్డ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. ఇప్పటికే రూ.20కోట్ల విలువగల 275 ఎకరాలకుపైగా భూమిని స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ వేశామన్నారు.