News September 21, 2025

గర్భిణులకు బార్లీ సురక్షితమేనా?

image

బార్లీ వాటర్‌ను తీసుకుంటే ప్రెగ్నెన్సీలో వచ్చే అనేక సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారిస్తుంది. కొందరిలో వికారం, గ్యాస్ సమస్యలను కూడా తగ్గిస్తుంది. డెలివరీ తర్వాత బ్రెస్ట్ మిల్క్‌ను పెంచడంలో బార్లీ సహాయపడుతుంది. రోజుకి 1-2 గ్లాసుల బార్లీ నీరు తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే విరేచనాలు, అలెర్జీ, రక్తస్రావం, సైనస్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

Similar News

News September 21, 2025

‘తిరుమలలో తొక్కిసలాట’ ప్రచారం నమ్మవద్దు: TTD

image

AP: తిరుమలలో తొక్కిసలాట అని, తిరుపతిలోని కపిలతీర్థంలో ఏర్పాట్లు చేయలేదని SMలో జరుగుతున్న ప్రచారాన్ని TTD ఖండించింది. ‘మహాలయ అమావాస్య వేళ కపిలతీర్థం ఆలయం బయట పితృతర్పణాలు జరపడం ఆనవాయితీ. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేశాం. ఎస్పీ, పోలీస్ వాహనాలు రావడం చూసి తొక్కిసలాట అని ప్రచారం చేస్తున్నారు. TTDపై దుష్ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించింది.

News September 21, 2025

రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో భారీ వర్షం

image

AP: రాబోయే 3 గంటల్లో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కాకినాడ, అనకాపల్లి, పల్నాడు (వినుకొండ) జిల్లాలకు రెడ్ అలర్ట్, శ్రీకాకుళం, అల్లూరి, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎన్టీఆర్, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

News September 21, 2025

స్పీడ్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు గోల్డ్

image

చైనాలో జరుగుతున్న స్పీడ్ స్కేటింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో తమిళనాడుకు చెందిన ఆనంద్‌ కుమార్ వెల్‌కుమార్ అదరగొట్టారు. 42 కి.మీ మారథాన్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. అంతకుముందు ఇదే టోర్నీలో 1000 మీటర్ల విభాగంలో గోల్డ్ మెడల్, 500m విభాగంలో బ్రాంజ్ గెలిచారు. కాగా 2021లో జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో ఆనంద్‌ స్వర్ణ పతకం గెలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత వరల్డ్ గేమ్స్‌లో కాంస్యం గెలిచారు.