News September 21, 2025

అటవీశాఖ నిర్లక్ష్యం.. మూగజీవాల మనుగడకు ప్రమాదం

image

అటవీశాఖ నిర్లక్ష్యం కారణంగా కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌లో మూగజీవాల మనుగడకు ప్రమాదం వాటిల్లుతోంది. అభయారణ్యంలో దుప్పిలు, కణుజులు, అడవి గొర్రెలు, పందుల వేట ముమ్మరంగా సాగుతోంది. వన్యప్రాణుల కోసం వేటగాళ్లు ఉచ్చులు పన్నుతున్నారు. ఈ అడవి 30 వేల ఎకరాల్లో ఉంది.. అటవీ ప్రాంతంలోనే దుప్పి మాంసాన్ని వండుకుని, అక్కడే భుజించడం, మద్యం తాగి రావటం అన్నది పరిసర ప్రాంతాల వారికి సరదాగా మారిందని స్థానికులు అంటున్నారు.

Similar News

News September 21, 2025

స్పీడ్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు గోల్డ్

image

చైనాలో జరుగుతున్న స్పీడ్ స్కేటింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో తమిళనాడుకు చెందిన ఆనంద్‌ కుమార్ వెల్‌కుమార్ అదరగొట్టారు. 42 కి.మీ మారథాన్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. అంతకుముందు ఇదే టోర్నీలో 1000 మీటర్ల విభాగంలో గోల్డ్ మెడల్, 500m విభాగంలో బ్రాంజ్ గెలిచారు. కాగా 2021లో జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో ఆనంద్‌ స్వర్ణ పతకం గెలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత వరల్డ్ గేమ్స్‌లో కాంస్యం గెలిచారు.

News September 21, 2025

డియర్ లాలెట్టన్.. ఇది మీకు తగిన గుర్తింపు: చిరంజీవి

image

మలయాళ హీరో మోహన్‌లాల్‌కు కేంద్రం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించిన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఆయనకు విషెస్ తెలిపారు. ‘మై డియర్ లాలెట్టన్.. మీరు ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైనందుకు హృదయపూర్వక అభినందనలు. మీ అద్భుతమైన ప్రయాణం, ఐకానిక్ పెర్ఫార్మెన్స్, భారతీయ సినిమాను సుసంపన్నం చేశాయి. నిజంగా ఇది మీకు తగిన గుర్తింపు’ అని Xలో పేర్కొంటూ మోహన్‌లాల్‌తో ఉన్న ఫోటోను షేర్ చేశారు.

News September 21, 2025

NLG: ప్రభుత్వ హాస్పిటల్ సెక్షన్ క్లర్క్ సస్పెండ్

image

నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ సెక్షన్ క్లర్క్ భార్గవ్‌ను కలెక్టర్ ఇలా త్రిపాఠి సస్పెండ్ చేశారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలను ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారని ఫిర్యాదులు రావడంతో చర్యలు తీసుకున్నారు. వేతనాలు సకాలంలో అందడం లేదని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు కలెక్టర్‌కు నివేదించారు. తన వ్యక్తిగత ఖాతాల్లోకి డబ్బులు మళ్లించాడని ఆయనపై గతంలోనూ పలు ఆరోపణలున్నాయి.