News September 21, 2025

HYD: రియల్ విస్తరణ.. బతు‘కమ్మే’ దిక్కు

image

బతుకమ్మ పండుగ పుష్పోత్సవ సౌందర్యాన్ని కోల్పోతుందా? HYDసహా శివారుకు రియల్ ఎస్టేట్ విస్తరించడంతో తంగేడు, గూనుగు, చామంతి, రుద్రాక్ష వంటి సంప్రదాయ పూలు దాదాపు కనపడడంలేదు. ఒకప్పుడు స్వచ్ఛమైన పూల జాతరగా వెలిగిన బతుకమ్మ, ఇప్పుడంతటా ఆకులపూదోటగా మారుతోంది. సంప్రదాయాన్ని పొగొట్టొద్దని మార్కెట్‌ నుంచి బంతిపూలు తెచ్చి ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. గుర్తుందా! నాడు పురుషులు ఈరోజున పూల కోసం ఉదయాన్నే బయలుదేరేవారు.

Similar News

News September 21, 2025

గాజులరామరంలో పేదల ఇళ్లు కూల్చం: రంగనాథ్

image

గాజులరామారంలో భారీగా కబ్జాలపై హైడ్రా కమీషనర్ రంగనాథ్ స్పష్టత ఇచ్చారు. 317 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నేతలు, అధికారులు ఆక్రమించిన భూములను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటుందన్నారు. పేదలఇళ్లను కూల్చొద్దని ఫీల్డ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. ఇప్పటికే రూ.20కోట్ల విలువగల 275 ఎకరాలకుపైగా భూమిని స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ వేశామన్నారు.

News September 21, 2025

ఆరోగ్యశ్రీతో NIMSలో ఉచిత గుండె శస్త్రచికిత్సలు

image

NIMSలో సెప్టెంబర్ 15 నుంచి 19 వరకు 4వ పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీ శిబిరం విజయవంతంగా పూర్తైంది. డా.రమణ, డా.ఎం.అమరేశ్ రావు ఆధ్వర్యంలో 22 మంది చిన్నారులకు క్లిష్టమైన గుండె ఆపరేషన్లు చేశారు. ఇందులో రష్యా, యూకే, భారత్‌కు చెందిన వైద్య నిపుణులు కలిసి సేవలందించారు. 500 మందికిపైగా రోగులు వైద్యపరీక్షలు చేయించుకున్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చికిత్సలు అందించారు.

News September 21, 2025

HYD: ఆడదే ఆధారం.. భార్యంటే త్యాగం!

image

ఆడదంటే ఆదిపరాశక్తి. ఆమె బంధం వరం, ఓపిక సంద్రం. వివాహ బంధంలోకి అడుగెడితే జీవితమంతా త్యాగమనడానికి వీరే నిదర్శనం. ఘట్కేసర్ అంకుషాపూర్‌‌కు చెందిన భిక్షపతి(50)కి భవానితో, శ్రీరాములు(42)కు సంధ్యతో పెళ్లైంది. 15ఏళ్లుగా వారి భర్తలు పక్షవాతంతో మంచానపడ్డారు. వారిని కాపాడుకుంటూ 7అడుగుల బాంధవ్య విలువను కాపాడుతున్నారు. భార్యంటే ప్రత్యక్ష దైవం, ఆడదే ఆధారం అనడానికి సజీవ సాక్ష్యమయ్యారు.
#నేడు భార్యల దినోత్సవం