News September 21, 2025

చిట్టి తల్లీ సీటు ఇప్పిస్తా.. నిశ్చింతగా చదువుకో: మంత్రి లోకేశ్

image

AP: KGBVలో సీటు రాకపోవడంతో కర్నూల్(D) బూదూరుకు చెందిన జెస్సీ అనే బాలిక పత్తి పొలంలో పనికి వెళ్తోందన్న మీడియా కథనంపై మంత్రి లోకేశ్ స్పందించారు. ‘అధికారులతో మాట్లాడాను. చిట్టి తల్లీ KGBVలో నీకు సీటు వస్తుంది. నిశ్చింతగా చదువుకో. పరిస్థితులేవైనా పుస్తకాలు, పెన్ను పట్టాల్సిన చేతులు పత్తి చేలో మగ్గిపోవడం బాధాకరం. విద్యకు పిల్లల్ని దూరం చేయొద్దని తల్లిదండ్రుల్ని వేడుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.

Similar News

News September 21, 2025

APPLY NOW: TRAIలో ఉద్యోగాలు

image

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (<>TRAI<<>>) 10 అసోసియేట్ కన్సల్టెంట్, 5 సీనియర్ అసోసియేట్ కన్సల్టెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు అక్టోబర్ 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీటెక్/బీఈ, ఎంఏ, ఎంబీఏ, ME/MTech, PhD అర్హత సాధించి ఉండాలి. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. వెబ్‌సైట్: https://vacancies.trai.gov.in/

News September 21, 2025

ట్రంప్‌ను ఓటర్లు గెలిపించింది ఇందుకే: వైట్‌‌హౌజ్

image

ట్రంప్ H-1B వీసా ఫీజును <<17767574>>భారీగా<<>> పెంచడాన్ని వైట్‌‌హౌజ్ సమర్థిస్తూ ఫ్యాక్ట్‌షీట్ రిలీజ్ చేసింది. ‘2003లో 32% ఉన్న వీసాలు ఇటీవల 65%కు పెరిగాయి. నిరుద్యోగుల సంఖ్య రెట్టింపైంది. ఈ ఏడాది ఓ కంపెనీ 5,189 వీసాలను ఆమోదించి 16వేల మంది US ఉద్యోగులను తొలగించింది. మరో కంపెనీ 2022 నుంచి 25,075 వీసాలను పొంది 27వేల మంది స్థానికులను తీసేసింది. ఓటర్లు ట్రంప్‌ను గెలిపించింది వారికి న్యాయం చేయడానికే’ అని వివరించింది.

News September 21, 2025

ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు ప్రభుత్వం వ్యతిరేకం: ఉత్తమ్

image

TG: కర్ణాటకలోని కృష్ణా నదిపై ఉన్న ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. ‘ఈ డ్యాంపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. నేను రేపు ఢిల్లీకి వెళ్తా. ఆల్మట్టి ఎత్తు పెంపుపై వ్యతిరేకంగా వాదనలు వినిపిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. దానిపై విచారణ జరుగుతోంది. ఎంతటివారైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం’ అని వివరించారు.