News September 21, 2025
KNR: ‘ఒక్కేసి పువ్వేసి’.. ఒక్కో రోజు.. తీరొక్క రూపంలో

ఉమ్మడి కరీంనగర్‌లో బతుకమ్మ సంబరాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో మహిళలు ఒక్కోరోజు ఒక్కో రూపంలో తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి పూజిస్తారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, 2వ రోజు అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలిగిన బతుకమ్మ, 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్నెముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మతో వేడుకలు ముగుస్తాయి.
Similar News
News September 21, 2025
KNR: ఎంగిలిపూల బతుకమ్మ విశిష్టతిదే..!

పూల పండుగలో మొదటి రోజు బతుకమ్మను ఆహ్వానిస్తూ కరీంనగర్లో ఎంగిలిపూల బతుకమ్మ పండుగ చేస్తారు. వర్షాకాలం ముగిసి కొత్త పంటలు రావడానికి సిద్ధమయ్యే రోజుగా ఈ పండుగను భావిస్తారు. ఇదే రోజున గౌరమ్మను తమ ఇంటికి ఆహ్వానించే రోజుగా కొలుస్తారు. తొలిరోజు బతుకమ్మను బంధువులను, స్నేహితులను కలిపే రోజుగా తలుస్తారు. వైద్యగుణాలు కలిగిన తంగేడు, గునుగు, బంతి, చామంతి, గుమ్మడి పువ్వులు వాడటం ఆనవాయితీగా వస్తోంది.
News September 21, 2025
ట్రంప్‌ను ఓటర్లు గెలిపించింది ఇందుకే: వైట్‌హౌజ్

ట్రంప్ H-1B వీసా ఫీజును <<17767574>>భారీగా<<>> పెంచడాన్ని వైట్‌హౌజ్ సమర్థిస్తూ ఫ్యాక్ట్‌షీట్ రిలీజ్ చేసింది. ‘2003లో 32% ఉన్న వీసాలు ఇటీవల 65%కు పెరిగాయి. నిరుద్యోగుల సంఖ్య రెట్టింపైంది. ఈ ఏడాది ఓ కంపెనీ 5,189 వీసాలను ఆమోదించి 16వేల మంది US ఉద్యోగులను తొలగించింది. మరో కంపెనీ 2022 నుంచి 25,075 వీసాలను పొంది 27వేల మంది స్థానికులను తీసేసింది. ఓటర్లు ట్రంప్‌ను గెలిపించింది వారికి న్యాయం చేయడానికే’ అని వివరించింది.
News September 21, 2025
KNR: ప్రకృతి పండుగకు పువ్వులు కరవు..!

బతుకమ్మ పండుగ అనగానే మహిళల్లో ఎనలేని ఆనందం నెలకొంటుంది. అలాంటి ప్రకృతి పండుగకు పూలే కరవయ్యాయి. నగరాలకు పూల కొరత ఉన్నప్పటికీ కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో పూలు మెరుగ్గానే దొరికేవి. కానీ, ప్రతి సెంటు భూమి కూడా సాగులోకి రావడంతో తంగేడు, గునుగు కనిపించట్లేదు. బతుకమ్మ పేర్చాలంటే ఈ రెండు రకాల పూలు లేకపోతే మహిళలకు తీసికట్టుగా ఉంటుంది. దీంతో గ్రామాల నుంచి నగరాలకు పూలు తరలివెళ్తున్నాయి.