News September 21, 2025
KNR: NHRC జిల్లా అధికార ప్రతినిధిగా స్వరూప

జాతీయ మానవ హక్కుల కమిటీ(NHRC) కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధిగా జమ్మికుంటకు చెందిన ఇటిక్యాల స్వరూపను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు డా.మొగుళ్ల భద్రయ్య నియామక పత్రం అందించారని కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఇమ్మడి ప్రణయ్ తెలిపారు. పేదప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఏర్పడిన జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా స్వరూప కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News September 21, 2025
KNR: మైనారిటీ పథకాలకు దరఖాస్తులు ఆహ్వానం

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన పథకాలకు అర్హులైన మైనారిటీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్టు KNR జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి బి.వెంకటేశ్వర్లు తెలిపారు. ఇందిరమ్మ మైనారిటి మహిళ యోజన, రేవంతన్నకా సహారా పథకాలకై అభ్యర్థులు tgobmms.cgg.gov.in పోర్టల్‌ను సందర్శించి, తమ దరఖాస్తులను సమర్పించాలని, మరిన్ని వివరాలకు జిల్లా మైనారిటి సంక్షేమ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
News September 20, 2025
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: సీపీ గౌస్ ఆలం

ఆన్లైన్లో వచ్చే అపరిచిత లింకులు, మెసేజ్‌లు, ఏపీకే ఫైళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులకు డబ్బులు బదిలీ చేయవద్దని, ఇతరుల నుంచి మీ ఖాతాలోకి డబ్బులు స్వీకరించవద్దని తెలిపారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 నంబర్‌కు లేదా www.cybercrime.gov.in వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు.
News September 20, 2025
ఆర్థిక నేరస్థులకు కఠిన శిక్షలు పడేలా చూడాలి: సీపీ గౌస్ ఆలం

ఆర్థిక నేరాలకు పాల్పడిన నిందితులకు శిక్షలు పడే విధంగా దర్యాప్తు చేయాలని సీపీ గౌస్ ఆలం పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం పోలీస్ కమిషనరేట్‌లో ఆర్థిక నేరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అక్షర చిట్‌ఫండ్, క్రిప్టో కరెన్సీ కేసులతో సహా అన్ని కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ఆయన సూచించారు. నిందితులకు శిక్ష పడటంతో పాటు బాధితులకు వారి సొమ్ము తిరిగి ఇప్పించడమే తమ ప్రధాన లక్ష్యమని సీపీ స్పష్టం చేశారు.