News September 21, 2025

KNR: నేటితో ‘పెత్తరమాస’ తర్పణాలు లాస్ట్..!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెత్తరమాస (పెద్దల అమావాస్య) ఈనెల 7న ప్రారంభమైంది. ఈ సందర్భంగా పక్షం రోజులు తండ్రి, తాత, ముత్తాతలు, ఇతరులను తలుచుకొని ఆరాధిస్తారు. వారి సంతానం నైవేద్యాలను సమర్పిస్తుంది. ఇలా చేస్తే తర్వాతి తరాలవారిపై పూర్వీకుల దీవెనలు ఉంటాయని మన పెద్దలు చెబుతుంటారు. కాగా, నేటితో ఈ తర్పణాల కార్యక్రమాలు ముగియనుండగా సాయంత్రం నుంచి బతుకమ్మ వేడుకలు వాడవాడలా ఘనంగా ప్రారంభం కానున్నాయి.

Similar News

News September 21, 2025

NGKL: హెచ్1బి ఫీజులు భారత యువతకు దెబ్బ

image

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన హెచ్1బి అసాధారణ ఫీజులను నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థకు, నిరుద్యోగ యువతకు, అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులకు చావుదెబ్బగా మారుతుందని అన్నారు. భారత ప్రభుత్వం తక్షణమే స్పందించి అమెరికాకు గట్టి సమాధానం ఇవ్వాలని, అవసరమైతే పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

News September 21, 2025

ప్రొద్దుటూరు: కుందూనదిలో మృతదేహం.. వ్యాపారిదేనా?

image

చాపాడు సమీపంలోని కుందూ నదిలో ఆదివారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ మృతదేహం ఇటీవల ప్రొద్దుటూరులో కిడ్నాప్‌కు గురైన వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి మృతదేహమే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాన్ని పోలీసులు బయటికి వెలికి తీశారు. వేణుగోపాల్ రెడ్డిని కిడ్నాప్ చేసి, హత్య చేసిన తర్వాత నదిలో పడేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సింది.

News September 21, 2025

మరికాసేపట్లో మోదీ ప్రసంగం.. ఉత్కంఠ

image

మరికాసేపట్లో ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. రేపటి నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానుండటం, GST సంస్కరణలు అమల్లోకి రానుండటం తెలిసిందే. ఈ అంశాలపైనే మాట్లాడతారా లేదా మరేదైనా సంచలన ప్రకటన చేస్తారా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అమెరికా టారిఫ్స్‌తో పాటు H-1B వీసా ఫీజు పెంపుపై స్పందించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 5PMకు మోదీ ప్రసంగాన్ని Way2Newsలో లైవ్ చూడండి.