News September 21, 2025
ఆరోగ్యశ్రీతో NIMSలో ఉచిత గుండె శస్త్రచికిత్సలు

NIMSలో సెప్టెంబర్ 15 నుంచి 19 వరకు 4వ పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీ శిబిరం విజయవంతంగా పూర్తైంది. డా.రమణ, డా.ఎం.అమరేశ్ రావు ఆధ్వర్యంలో 22 మంది చిన్నారులకు క్లిష్టమైన గుండె ఆపరేషన్లు చేశారు. ఇందులో రష్యా, యూకే, భారత్‌కు చెందిన వైద్య నిపుణులు కలిసి సేవలందించారు. 500 మందికిపైగా రోగులు వైద్యపరీక్షలు చేయించుకున్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చికిత్సలు అందించారు.
Similar News
News September 21, 2025
NGKL: హెచ్1బి ఫీజులు భారత యువతకు దెబ్బ

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన హెచ్1బి అసాధారణ ఫీజులను నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థకు, నిరుద్యోగ యువతకు, అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులకు చావుదెబ్బగా మారుతుందని అన్నారు. భారత ప్రభుత్వం తక్షణమే స్పందించి అమెరికాకు గట్టి సమాధానం ఇవ్వాలని, అవసరమైతే పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
News September 21, 2025
ప్రొద్దుటూరు: కుందూనదిలో మృతదేహం.. వ్యాపారిదేనా?

చాపాడు సమీపంలోని కుందూ నదిలో ఆదివారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ మృతదేహం ఇటీవల ప్రొద్దుటూరులో కిడ్నాప్‌కు గురైన వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి మృతదేహమే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాన్ని పోలీసులు బయటికి వెలికి తీశారు. వేణుగోపాల్ రెడ్డిని కిడ్నాప్ చేసి, హత్య చేసిన తర్వాత నదిలో పడేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సింది.
News September 21, 2025
మరికాసేపట్లో మోదీ ప్రసంగం.. ఉత్కంఠ

మరికాసేపట్లో ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. రేపటి నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానుండటం, GST సంస్కరణలు అమల్లోకి రానుండటం తెలిసిందే. ఈ అంశాలపైనే మాట్లాడతారా లేదా మరేదైనా సంచలన ప్రకటన చేస్తారా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అమెరికా టారిఫ్స్‌తో పాటు H-1B వీసా ఫీజు పెంపుపై స్పందించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 5PMకు మోదీ ప్రసంగాన్ని Way2Newsలో లైవ్ చూడండి.