News September 21, 2025

పాతబస్తీ పనుల్లో వేగం పెంచండి: మెట్రో MD

image

HYD మెట్రో రైల్ ప్రాజెక్టుపై HMRL ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. మెట్రో మొదటి దశ, ముఖ్యంగా పాత నగరంలో పనులను వేగవంతం చేయాలని, సవాళ్లను అధిగమించేందుకు ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మెట్రో 2వ దశ ప్రాజెక్టునూ సమీక్షిస్తూ, సీఎం మార్గదర్శనంలో అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

Similar News

News September 21, 2025

ఇజ్రాయెల్ దాడులు.. ఒక్క రోజే 91 మంది మృతి!

image

గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఒక్క రోజే 91 మంది పాలస్తీనియన్లు చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇళ్లు, షెల్టర్లు, వాహనాలపై దాడులు జరిగినట్లు తెలిపింది. పేలుడు పదార్థాలు నింపిన రోబోలను ఇజ్రాయెల్ దళాలు వాడుతున్నట్లు పేర్కొంది. గత 2 వారాల్లో 20 టవర్ బ్లాక్‌లపై అటాక్స్ జరిగాయని, లక్షలాది మంది నిరాశ్రయులైనట్లు వెల్లడించింది. అటు యుద్ధం ఆపేయాలంటూ వేలాది మంది టెల్ అవీవ్‌లో నిరసనలకు దిగారు.

News September 21, 2025

వరంగల్: ఎడ్లబండి ఏడుస్తోంది..!

image

కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ పెరుగుతోంది. దీంతో వ్యవసాయానికి వాడే పనిముట్లను పక్కనబెట్టి యంత్రాలను వాడుతుండటంతో వాటినే నమ్ముకొని బతుకుతున్న వడ్రంగి వృత్తి వారికి ఉపాధి లేకుండా పోతోంది. దీంతో ఎడ్ల బండ్లు, నాగళ్లు కనుమరుగయ్యాయి. గ్రామాల్లో ఎక్కడో ఒకచోట మాత్రమే ప్రస్తుతం ఎడ్లబండ్లు కనిపిస్తున్నాయి. మానుకోట జిల్లా కౌసల్యాదేవిపల్లిలో ఓ రైతన్న ఎడ్లబండిని తీసుకెళ్తుండగా Way2News చిత్రీకరించింది.

News September 21, 2025

పెద్దపల్లి: అక్టోబర్ 3 వరకు దసరా సెలవులు

image

పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు దసరా సెలవులను నేటి నుంచి అక్టోబర్ 3 వరకు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. ప్రకటించిన విధంగా సెలవులు పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలలపై కఠిన చర్యలు తప్పవని ఆమె స్పష్టం చేశారు. విద్యార్థులు ఇంటి దగ్గర సెలవుల్లో జాగ్రత్తగా ఉండాలి DEO సూచించారు.