News September 21, 2025
MLG: సెల్ఫీ దిగుతూ కిందపడి యువకుడు మృతి

వాజేడు మం.లో విషాదం నెలకొంది. కొంగాల జలపాతం సందర్శనకు 8 మంది స్నేహితులతో వెళ్లిన ఓ యువకుడు గల్లంతై మరణించినట్లు స్థానికులు తెలిపారు. జలపాతం వద్ద సెల్ఫీ దిగేందుకు గుట్టపైకి ఎక్కిన యువకుడు కాలుజారి కిందపడ్డట్లు చెప్పారు. ఇది తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కాగా, కొంగాల జలపాతానికి అనుమతి లేకున్నా అధికారుల కళ్లుగప్పి కొందరు సందర్శనకు వెళ్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
Similar News
News September 21, 2025
HYDలో దారితప్పిన పొల్యూషన్ కంట్రోల్..!

గ్రేటర్ హైదరాబాద్‌లో 83 లక్షలకు మించి వాహనాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీటిలో సరైన తనిఖీలు జరగకపోవడంతో పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికెట్లు నిబంధనలను ఉల్లంఘించి జారీ చేస్తున్నారని, ప్రతి సంవత్సరం 8,250 టన్నుల PM 2.5 ఉద్గారాలు వెలువడుతున్నాయని ARR రిపోర్ట్ వెల్లడించింది. దీంతో నగరంలో కాలుష్యం పెరుగుతోందని చెబుతోంది.

HYD: నగర దాహార్తిని తీరుస్తున్న జలాశయాలు

1,450 కిలోమీటర్ల పరిధిలో జలమండలి ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం 14.07 లక్షల వరకు నీటి కనెక్షన్లు ఉన్నాయన్నారు. హైదరాబాద్ మహా నగరానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, సింగూరు, మంజీరా, కృష్ణ ఫేస్ 1, 2, 3, గోదావరి జలాలు నీరు అందిస్తున్నాయని చెప్పారు. ప్రతిక్షణం వెయ్యి మందికి పైగా అధికారులు వీటిని పరిశీలిస్తున్నారన్నారు.