News September 21, 2025

ADB: మసకబారుతున్న జ్ఞాపకాలు.. నేడు అల్జీమర్స్ డే

image

ఒరేయ్, ఏరా అని పిలిచే తాత, నానమ్మ మనల్ని గుర్తుపట్టకపోతే ఎలా ఉంటుంది. ఇలాంటి జ్ఞాపకశక్తిని కోల్పోయేలా చేసే వ్యాధే అల్జీమర్స్. వృద్ధాప్యంలో కనిపించే ఈవ్యాధితో మొదటగా చిన్న విషయాలు మర్చిపోవడం, మాటల్లో తడబడటం కనిపిస్తుంది. తర్వాత దశలో రోగి తన కుటుంబీకులను గుర్తుపట్టలేని స్థితికి చేరవచ్చు. ఆరోగ్య సమస్యలతో ఈ వ్యాధి వస్తుంది. వృద్ధులే మన అ’పూర్వ’ సంపద వారిని కాపాడుకుందాం. ADBలో 50000+ వృద్ధులున్నారు.

Similar News

News September 21, 2025

పంజాబ్ & సింధ్ బ్యాంక్‌లో 190 పోస్టులు

image

<>పంజాబ్ <<>>& సింధ్ బ్యాంక్‌ 190 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు OCT 10 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ(అగ్రికల్చర్, హార్టికల్చర్, డెయిరీ, యానిమల్ హజ్బెండరీ, ఫారెస్ట్రీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్), CA/CMA, CFMA/MBA(ఫైనాన్స్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 35ఏళ్లు. రాత పరీక్ష, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

News September 21, 2025

ఖమ్మం: ఊరెళ్తున్నారా.. ఊడ్చేస్తారు జాగ్రత్త..!

image

బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ప్రభుత్వం నేటి నుంచి 13 రోజుల వరకు సెలవులు ప్రకటించింది. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మంలో పట్టణాలు విడిచి, సొంత ఊర్లకు, విహారయాత్రలకు, బంధువుల ఇళ్లకు వెళ్తుంటారు. ఇదే అదునుగా భావించి దొంగలు రెచ్చిపోతుంటారు.. ఇళ్లు విడిచి వెళ్లేటప్పుడు డబ్బులు, బంగారు, వెండి ఆభరణాలపై జాగ్రత్తలు తీసుకోండి. విలువైన వస్తువులు ఇంట్లో ఉంటే తమకు ముందస్తు సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు.

News September 21, 2025

HYD: రైలు ప్రయాణికులకు GOOD NEWS

image

రైల్వే ప్రయాణికులకు సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. రిజర్వేషన్ టికెట్లు, ఆన్ రిజర్వేషన్ టికెట్లు, ఫుడ్ ఆర్డర్, ఫ్లాట్ ఫారం టికెట్, రైల్వే భద్రత సమాచారం సహా వివిధ సేవలను కలిపి ‘RailOne యాప్’ పేరిట ఒకే యాప్‌లో అందిస్తున్నారు. ఇప్పుడు అన్ని రైలు సంబంధిత సేవలను ఒకే యాప్ ద్వారా పొందవచ్చని అధికారులు తెలిపారు. SHARE IT