News September 21, 2025

JGTL: బయాలజీ ఉపాధ్యాయుడికి OU డాక్టరేట్

image

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం ZPHSలో బయాలజీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మల్లేశ్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. ఈయన ‘మార్పో అనాటమికల్ & ఫైటో కెమికల్ స్టడీస్ ఆన్ లెస్సెర్ నోన్ ఇతనో మెడిసినల్ ప్లాంట్స్ ఫ్రమ్ రామగిరి ఖిల్లా ఆఫ్ PDPL డిస్ట్రిక్ట్’ మీద అధ్యయనం చేశారు. ఇందుకు మల్లేశ్‌కు PhD పట్టా లభించింది. పాఠశాల HM చంద్రకళ, పాఠశాల ఉపాధ్యాయులు ఆయనను సన్మానించారు.

Similar News

News September 21, 2025

పరకామణి కేసు లోక్ అదాలత్‌లో రాజీ కాదా…?

image

రవికుమార్ పరకామణిలో దొంగతనం చేసి 2023 ఏప్రిల్‌లో పట్టుబడ్డారు. ఆయనపై పోలీసులు సెక్షన్ 379, 381 కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్‌లో 379 దొంగతనం కేసు కాగా, సెక్షన్ 381‌లో యజమాని ఆస్తిని క్లర్క్, ఇతర ఉద్యోగులు దొంగిలించడం ద్రోహం అని చట్టం చెబుతోంది. ఇదే అంశాన్ని CRPC సెక్షన్ 320 క్లాస్ 2 అనుగుణంగా లోక్ అదాలత్‌లో రాజీ చేసుకునే వీలు లేదని చట్టాలు చెప్తున్నాయి. ఈ కేసు విషయం CBCID దర్యాప్తులో తేలనుంది.

News September 21, 2025

సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు: ఎస్పీ

image

పుట్టపర్తి ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో రాజకీయ పార్టీలపైన కానీ, కులమతాల పైనగాని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. అలాంటి వారిపై కేసులు పెట్టి జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఈ మేరకు కదిరికి చెందిన అంజాద్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్టు చేశామన్నారు. ఆయనపై ఐదు కేసులు నమోదు చేసి జైలుకు పంపామని తెలిపారు.

News September 21, 2025

HYD: పేదలు నివసిస్తున్న ప్రాంతాలను తొలగించట్లేదు: కమిషనర్

image

మేడ్చల్ జిల్లా <<17784226>>గాజులరామారంలో<<>> ప్రభుత్వ భూముల ఆక్రమణలను మాత్రమే తొలగిస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈరోజు స్పష్టం చేశారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్న వారిలో రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు ఉన్నారని, 40 ఎకరాల్లో పేదలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారన్నారు. అధికారులతో స్థానిక నేతలు కుమ్మక్కై పేదలకు స్థలాలు విక్రయించారని, పేదలు నివసిస్తున్న ప్రాంతాలను హైడ్రా తొలగించట్లేదని కమిషనర్ పేర్కొన్నారు.