News September 21, 2025

‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు అందుకున్న తెలుగువాళ్లు వీరే!

image

మోహన్‌లాల్‌‌ను ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ అవార్డు వరించిన నేపథ్యంలో గతంలో ఈ అవార్డు అందుకున్న తెలుగు వారెవరో తెలుసుకుందాం. BN రెడ్డి(1974) దక్షిణాది నుంచి ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తిగా నిలిచారు. తర్వాత LV ప్రసాద్(1982), B.నాగిరెడ్డి(1986), ANR(1990), రామానాయుడు(2009), K విశ్వనాథ్(2016) అందుకున్నారు. దక్షిణాదిలో వీరితో పాటు రజినీకాంత్, బాలచందర్, గోపాలకృష్ణన్, శివాజీ గణేషన్, రాజ్‌కుమార్‌కు దక్కింది.

Similar News

News September 21, 2025

మైథాలజీ క్విజ్ – 12 సమాధానాలు

image

1. లక్ష్మణుడి భార్యయైన ఊర్మిళ తండ్రి ‘జనక మహారాజు’. సీతమ్మవారి తండ్రి కూడా జనకుడే.
2. మహాభారతంలో సత్యవతి, శంతనుల కుమారులు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు.
3. వేదాల ప్రకారం.. మొదట మరణించిన వ్యక్తి ‘యముడు’.
4. మానస సరోవరం చైనాలో ఉంది.
5. సమ్మక్క సారలమ్మ జాతర ములుగు జిల్లాలో జరుగుతుంది.
<<-se>>#mythologyquiz<<>>

News September 21, 2025

శ్రీవారి హుండీ సొమ్ము నొక్కేసింది వాస్తవం కాదా: TDP

image

AP: జగన్ హయాంలో పరకామణిలో జరిగిన రూ.100 కోట్ల కుంభకోణం వెనుక ఉన్నది ఎవరు? అని వైసీపీ నేతలను TDP ప్రశ్నించింది. ‘దొంగతనం చేసిన వాడిని శిక్షించకుండా, రాజీ ఎందుకు కుదిర్చారు? దొరికిన దొంగకు చెందిన ఆస్తులు, ఎవరి పేరున రిజిస్టర్ చేయించారు? చిన్న దొంగలు, పెద్ద దొంగలు కలిసి శ్రీవారి హుండీ సొమ్ము నొక్కేసింది వాస్తవం కాదా? హైకోర్టు తీర్పుతో జగన్ హయాంలో జరిగిన పాపం పండింది’ అని ఓ ఫొటోను పోస్ట్ చేసింది.

News September 21, 2025

పంజాబ్ & సింధ్ బ్యాంక్‌లో 190 పోస్టులు

image

<>పంజాబ్ <<>>& సింధ్ బ్యాంక్‌ 190 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు OCT 10 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ(అగ్రికల్చర్, హార్టికల్చర్, డెయిరీ, యానిమల్ హజ్బెండరీ, ఫారెస్ట్రీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్), CA/CMA, CFMA/MBA(ఫైనాన్స్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 35ఏళ్లు. రాత పరీక్ష, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.