News September 21, 2025
ADB: దేశీ’దారు’లు తొక్కుతోంది..!

మహారాష్ట్రలో అతిగా తాగే దేశీదారు సరఫరా జిల్లాలోకి పాకుతోంది. సరిహద్దు మండలాలైన భీంపూర్, తాంసి, తలమడుగు, బేల, జైనథ్‌లకు ఈ అక్రమ మద్యం అధికంగా సరఫరా అవుతోంది. పోలీసులు తనిఖీలు నిర్వహించి, పట్టుకొని కేసులు పెడుతున్నా.. అక్రమ దందాను నిందితులు ఆపడం లేదు. నేరుగా రోడ్లపైనే తీసుకొస్తున్నారు. పోలీసులుంటే నాటు పడవల్లో పెన్ గంగా మీదుగా దాటించి, ఇక్కడికి సరఫరా చేస్తున్నారని ప్రజలు చెబుతున్నారు.
Similar News
News September 21, 2025
విజయవాడ: జగజ్జననీకి సమర్పించే నైవేద్యం ఇదే

కనకదుర్గమ్మవారికి వేకువజాము సుప్రభాతం, పూజాదికాలు, సాంబ్రాణి అనంతరం బాలభోగం కింద దద్ధోజనం సమర్పిస్తారు. తర్వాత ఉదయం 10కి రవ్వకేసరి, పులిహోర, దద్ధోజనం, కట్టెపొంగలి, లడ్డు బూంది, చక్రపొంగలితో రాజభోగం, 12కి గారెలతో పంచభోగాలను నివేదిస్తారు. సాయంత్రం 4కి శనగలు, స్వీట్, హాట్..6 గంటలకు మహానివేదనలో కదంబవంటకం, కూరలు, స్వీట్, హాట్ తదితర పదార్థాలు అమ్మవారికి సమర్పిస్తామని అర్చకులు వెల్లడించారు.
News September 21, 2025
దసరా పండుగ.. జర ఇల్లు భద్రం: వరంగల్ సీపీ

దసరా సెలవులకు వెళ్లే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ప్రజలను అప్రమత్తం చేశారు. దసరా సెలవులను పురస్కరించుకొని తమ స్వగ్రామాలు, విహార యాత్రలకు తరలి వెళ్తుండటంతో ఇళ్లల్లో చోరీలను నియంత్రణ చేసేందుకు పోలీసులు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే, చోరీల కట్టడికై ప్రజలు సైతం తమ వంతు భాధ్యత పోలీసులు సూచినలు పాటించాలని సీపీ ప్రజలకు తెలిపారు.
News September 21, 2025
NRML: ‘బతుకమ్మ, బాసర నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి’

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి 30 వరకు జరగనున్న బతుకమ్మ, దసరా ఉత్సవాల కోసం జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. బాసరలో నవరాత్రి ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో అన్ని వసతులు కల్పిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.