News September 21, 2025
PDPL: కలెక్టర్‌పై ఆరోపణలు ఖండించాలి: శంకర్

PDPL కలెక్టర్‌పై నిరాధార ఆరోపణలను టీజ్యాక్ జిల్లా ఛైర్మన్ బొంకూరి శంకర్ తీవ్రంగా ఖండించారు. RGMలోని ఆశ్రమ పాఠశాల భూ కేటాయింపులో కలెక్టర్ డబ్బులు అడిగారని కొన్నివర్గాలు చేసిన ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. కలెక్టర్ ప్రజాసేవలో అంకితభావంతో పనిచేస్తుండగా, ఈ తరహా ఆరోపణలు ఉద్యోగుల మానసిక స్థితిని దెబ్బతీసే విధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాల అమలులో కలెక్టర్ పటిష్ఠంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
Similar News
News September 21, 2025
దసరా పండుగ.. జర ఇల్లు భద్రం: వరంగల్ సీపీ

దసరా సెలవులకు వెళ్లే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ప్రజలను అప్రమత్తం చేశారు. దసరా సెలవులను పురస్కరించుకొని తమ స్వగ్రామాలు, విహార యాత్రలకు తరలి వెళ్తుండటంతో ఇళ్లల్లో చోరీలను నియంత్రణ చేసేందుకు పోలీసులు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే, చోరీల కట్టడికై ప్రజలు సైతం తమ వంతు భాధ్యత పోలీసులు సూచినలు పాటించాలని సీపీ ప్రజలకు తెలిపారు.
News September 21, 2025
NRML: ‘బతుకమ్మ, బాసర నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి’

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి 30 వరకు జరగనున్న బతుకమ్మ, దసరా ఉత్సవాల కోసం జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. బాసరలో నవరాత్రి ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో అన్ని వసతులు కల్పిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
News September 21, 2025
అమెరికాలో వరంగల్ వాసుల బతుకమ్మ సంబరాలు

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అమెరికా వెళ్లి న్యూయార్క్ సిటీలో స్థిరపడ్డ వారు ఎంగిలిపూల బతుకమ్మతో బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు. అమెరికా తెలుగు సంఘం ప్రతినిధి రమ బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు. అమెరికాలోను తెలంగాణ సంప్రదాయాలను కొనసాగిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మలను రూపొందించి అట, పాటలతో కోలాహలంగా సందడి చేశారు.