News September 21, 2025

PDPL: ఇద్దరు యువకులపై కత్తిపోట్లు.. పోలీసుల దర్యాప్తు

image

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణం కృష్ణానగర్‌కు చెందిన కుమారస్వామితో పాటు భాస్కర్‌పై గుర్తుతెలియని వ్యక్తి శనివారం రాత్రి కత్తితో దాడి చేశాడు. ఇంటి వద్దనే ఈ ఘటన జరగడంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. తీవ్రంగా గాయపడిన కుమారస్వామి, భాస్కర్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News September 21, 2025

NRML: ‘బతుకమ్మ, బాసర నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి’

image

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి 30 వరకు జరగనున్న బతుకమ్మ, దసరా ఉత్సవాల కోసం జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. బాసరలో నవరాత్రి ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో అన్ని వసతులు కల్పిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

News September 21, 2025

అమెరికాలో వరంగల్ వాసుల బతుకమ్మ సంబరాలు

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అమెరికా వెళ్లి న్యూయార్క్ సిటీలో స్థిరపడ్డ వారు ఎంగిలిపూల బతుకమ్మతో బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు. అమెరికా తెలుగు సంఘం ప్రతినిధి రమ బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు. అమెరికాలోను తెలంగాణ సంప్రదాయాలను కొనసాగిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మలను రూపొందించి అట, పాటలతో కోలాహలంగా సందడి చేశారు.

News September 21, 2025

HYD: ‘కమీషన్ల కోసం దొంగ టిక్కెట్లు..!’

image

గ్రేటర్ HYD వ్యాప్తంగా రోజుకు 26 లక్షల మంది ఆర్టీసీలో ప్రయాణిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో మహాలక్ష్మి ప్రయాణాలు 72% ఉన్నట్లు తెలిపారు. అనేక డిపోలకు టార్గెట్లు నిర్ణయించగా కొంత మంది కండక్టర్లు కమీషన్ల కోసం దొంగ టికెట్లు కొడుతున్నట్లు గుర్తించి పలుచోట్ల హెచ్చరించినట్లు అధికారులు చెప్పారు.