News September 21, 2025
HYD: ఆడదే ఆధారం.. భార్యంటే త్యాగం!

ఆడదంటే ఆదిపరాశక్తి. ఆమె బంధం వరం, ఓపిక సంద్రం. వివాహ బంధంలోకి అడుగెడితే జీవితమంతా త్యాగమనడానికి వీరే నిదర్శనం. ఘట్కేసర్ అంకుషాపూర్‌కు చెందిన భిక్షపతి(50)కి భవానితో, శ్రీరాములు(42)కు సంధ్యతో పెళ్లైంది. 15ఏళ్లుగా భర్తలిద్దరు పక్షవాతంతో మంచానపడ్డారు. వారిని కాపాడుకుంటూ 7అడుగుల బాంధవ్య విలువను కాపాడుతున్నారు. భార్యంటే ప్రత్యక్ష దైవం, ఆడదే ఆధారం అనడానికి సజీవ సాక్ష్యమయ్యారు.
#నేడు భార్యల దినోత్సవం.
Similar News
News September 21, 2025
అనకాపల్లి: రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

అనకాపల్లి కలెక్టరేట్తో పాటు మండల, మున్సిపల్, డివిజన్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. నేరుగా రాలేనివారు సమస్యలను meekosam.ap.gov.in వెబ్ సైట్ ద్వారా పంపించడానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. అర్జీల పరిస్థితి తెలుసుకునేందుకు 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చునన్నారు.
News September 21, 2025
మహబూబాబాద్: రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్

మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. జిల్లాస్థాయి అధికారులు అందరూ యూరియా పంపిణీ కార్యక్రమంలో భాగమై ఉన్నందున ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కావున, జిల్లా ప్రజల వారు రేపు కలెక్టరేట్‌కు రావద్దని సూచించారు.
News September 21, 2025
వారపు సంతల్లో వైద్య శిబిరాలు నిర్వహించండి: కలెక్టర్

పార్వతీపురం జిల్లాలోని మారుమూల ప్రాంత ప్రజలకు వైద్య సేవలను అందించేందుకు గిరిజన వారపు సంతల్లో శిబిరాలను నిర్వహించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. సంతలకు వచ్చే ప్రజల ఆరోగ్య అవసరాల మేరకు రక్త పరీక్షలను నిర్వహించాలని అన్నారు. రక్త పరీక్షల్లో వ్యాధులు నిర్ధారణ అయితే వారికి ఉచిత వైద్యంతో పాటు మందులను సరఫరా చేయాలన్నదే ముఖ్య ఉద్దేశ్యమని కలెక్టర్ తెలిపారు.