News September 21, 2025

BSFలో 1121 ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే ఆఖరు

image

<>BSF<<>>లో 1121 హెడ్ కానిస్టేబుల్(రేడియో ఆపరేటర్, రేడియో మెకానిక్) పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఎల్లుండే(సెప్టెంబర్ 23) ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ లేదా ఇంటర్‌(ఎంపీసీ) పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులను రాతపరీక్ష, PST, PET, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థుల వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

Similar News

News September 21, 2025

కాసేపట్లో వర్షం

image

TG: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రానున్న 2గంటల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రాజేంద్ర నగర్, చార్మినార్, ఎల్బీ నగర్, ఉప్పల్, ఖైరతాబాద్, అబిడ్స్, సికింద్రాబాద్, కాప్రా, మల్కాజ్‌గిరి ప్రాంతాల్లో వర్షాలకు ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. మీ ఏరియాలో వాతావరణం ఎలా ఉంది?

News September 21, 2025

సెల్ఫీ తీసుకుంటూ జలపాతంలో పడి మృతి

image

TG: అధికారుల కళ్లుగప్పి 9 మంది యువకులు అనుమతి లేని జలపాతం వద్దకు వెళ్లగా, వారిలో ఒకరు మృతిచెందిన ఘటన ములుగు(D)లో జరిగింది. HYDలోని ఉప్పల్‌కు చెందిన మహాశ్విన్ 8మంది స్నేహితులతో కలిసి వాజేడు(M) కొంగాల జలపాతానికి వెళ్లారు. అక్కడ సెల్ఫీ తీసుకునేందుకు జలపాతం గట్టుమీద కూర్చొని కాలుజారి నీటిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి యువకుడి మృతదేహాన్ని వెలికితీశారు.

News September 21, 2025

ఈ ఏడాది నవరాత్రుల ప్రత్యేకత ఏంటంటే?

image

ఈ ఏడాది చైత్ర నవరాత్రులు ఆదివారం ప్రారంభం కావడంతో దుర్గాదేవి శరన్నవరాత్రుల్లో భూమిపైకి ఏనుగు మీద వస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ ఆగమనం అత్యంత శుభప్రదమని అంటున్నారు. ‘అందువల్ల సకాలంలో వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండి, దేశం సుభిక్షంగా ఉంటుంది. దుర్గమ్మ తన భక్తులను కష్టాల నుంచి విముక్తి చేసి, సుఖసంతోషాలను ప్రసాదిస్తుంది. దీంతో మన జీవితాల్లో సానుకూల మార్పులు వస్తాయి’ అని సూచిస్తున్నారు.