News September 21, 2025
NLG: ప్రభుత్వ హాస్పిటల్ సెక్షన్ క్లర్క్ సస్పెండ్

నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ సెక్షన్ క్లర్క్ భార్గవ్‌ను కలెక్టర్ ఇలా త్రిపాఠి సస్పెండ్ చేశారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారని ఫిర్యాదులు రావడంతో చర్యలు తీసుకున్నారు. వేతనాలు సకాలంలో అందడం లేదని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు కలెక్టర్‌కు నివేదించారు. తన వ్యక్తిగత ఖాతాల్లోకి డబ్బులు మళ్లించాడని ఆయనపై గతంలోనూ పలు ఆరోపణలున్నాయి.
Similar News
News September 21, 2025
గద్వాల జిల్లాలో 2250 మంది కుక్కకాటు బాధితులు

జోగులాంబ గద్వాల జిల్లాలో కుక్కకాటు బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. గ్రామాల్లో ఏదో ఒకచోట కుక్కకాటుకు ప్రజలు గురవుతున్నారు. జిల్లాలో ఏడాదిలో 2250 మంది కుక్కకాటు గురై ఆసుపత్రులలో చికిత్సలు చేయించుకుంటున్నారు. ఏ గ్రామంలో చూసిన రోడ్లపై ప్రజలు వెళ్లాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏది ఏమైనా కుక్కల బెడద నుంచి ప్రజలను రక్షణ రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
News September 21, 2025
విశాఖ ఈ-గవర్నెన్స్ సదస్సుకు కేంద్ర సహాయ మంత్రి

కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం విశాఖలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.05కి విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడనుండి నగరంలోని ప్రైవేట్ హోటల్‌కి చేరుకుని 3 నుంచి 4.30 వరకు 28వ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సుకు హాజరవుతారు. సాయంత్రం ఐదు గంటలకు తిరిగి ఢిల్లీ వెళ్తారు. ఈ సదస్సుకి సీఎం చంద్రబాబు కూడా హాజరవుతున్నారు.
News September 21, 2025
పార్వతీపురం: ఈనెల 22న వారపు సంతల్లో వైద్య శిబిరాలు

పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన వారపు సంతల్లో వైద్య శిబిరాలను నిర్వహించాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్ది ఆదివారం వైద్యాధికారులను ఆదేశించారు. సంతలకు విచ్చేసే ప్రజల ఆరోగ్య, రక్త పరీక్షలతో రోగులకు ఉచిత వైద్యం, మందులు పంపిణీ చేయాలన్నారు. ఈనెల 22న పాలకొండ మండలం నవగాం, కురుపాం మండలం నీలకంఠాపురం, సీతంపేట మండలం సీతంపేటలో వారపు సంతల్లో వైద్య శిబిరాలు నిర్వహించి మెరుగైన సేవలు అందించాలని సూచించారు.