News April 5, 2024

వరంగల్ RDO ఆఫీసు జప్తు

image

తెలంగాణ హైకోర్టు తీర్పుతో వరంగల్ RDO ఆఫీసును అధికారులు జప్తు చేశారు. గీసుకొండ మండలం శాయంపేట సమీపంలో ఏర్పాటు చేసిన టెక్స్‌టైల్ పార్క్ కోసం భూమి ఇచ్చిన నిర్వాసితులకు పరిహారం అందలేదు. దీనిపై రైతు సముద్రాల స్వామి, అతడి కూతురు వెన్నెల హైకోర్టును ఆశ్రయించారు. పరిహారం ఇవ్వాలని గతంలో ఇచ్చిన తీర్పును పట్టించుకోకపోవడంతో RDO ఆఫీసు జప్తు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.

Similar News

News December 26, 2024

వరంగల్ జిల్లాలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

image

క్రిస్మస్ వేడుకలతో ఉమ్మడి వరంగల్ జిల్లా దద్దరిల్లింది. నగరంతో పాటు.. జిల్లాలోని పలు చర్చిల్లో పాస్టర్లు ప్రార్థనలు చేసి ఏసుక్రీస్తు చూపిన మార్గంలో అంతా నడవాలని సూచించారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని జీసస్ పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు. చర్చ్‌లతో పాటు.. నగరం అంతా దీపాల వెలుగులతో నింపేశారు. కాగా, క్రిస్మస్ మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి.

News December 26, 2024

UPDATE.. వరంగల్: శ్వాస సంబంధిత సమస్యతో విద్యార్థిని ఆత్మహత్య: SI

image

హన్మకొండలోని ఏకశిలా కాలేజీలో <<14975739>>ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని<<>> ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కేయూ పోలీస్ స్టేషన్ ఎస్సై బి.రవిందర్ వివరాల ప్రకారం.. MHBD జిల్లా నెల్లికుదురు మండలానికి చెందిన శ్రీదేవి శ్వాస సంబంధిత వ్యాధి సమస్యతో హాస్టల్‌లోని ఫ్యాన్‌కు ఉరేసుకుంది. కాగా, దీనికి కళాశాల యాజమాన్యమే కారణమంటూ విద్యార్థి సంఘాలు రాత్రి వరకు ఆందోళన చేశాయి. కేసు నమోదైంది.

News December 25, 2024

WGL: BJP కొత్త సారథులు ఎవరు?

image

ఉమ్మడి WGLజిల్లాలో BJPని బలోపేతం చేసేందుకు అధిష్ఠానం దృష్టిసారించింది. JANలో తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలకు కొత్త సారథులను నియమించనున్నారు. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతూ BJPని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరి వరంగల్, హనుమకొండ, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ జిల్లాలకు నూతన అధ్యక్షులు ఎవరు అవుతారో వేచి చూడాలి. దీనిపై మీ కామెంట్?