News September 21, 2025
KNR: ఒక్కోమహిళకు రూ.50వేలు.. రూ.లక్ష స్కూటీ!

ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన కింద వ్యాపారాల కోసం ఒక్కోమహిళ రూ.50,000 పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని KNR మైనారిటీ సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లు కోరారు. అలాగే రేవంతన్న కా సహారా స్కీంలో భాగంగా అందించే రూ.లక్ష విలువగల మోపెడ్(స్కూటీ) వాహనాలు పొందేందుకు tgobmms.cgg.gov.in ద్వారా ఆన్లైన్లో APPLY చేసుకోవాలన్నారు. ఇందుకు చివరితేదీ OCT 6 అని, మరిన్ని వివరాలకు 0878-2957085ను సంప్రదించాలన్నారు. #SHARE IT.
Similar News
News September 21, 2025
సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు: ఎస్పీ

పుట్టపర్తి ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో రాజకీయ పార్టీలపైన కానీ, కులమతాల పైనగాని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. అలాంటి వారిపై కేసులు పెట్టి జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఈ మేరకు కదిరికి చెందిన అంజాద్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్టు చేశామన్నారు. ఆయనపై ఐదు కేసులు నమోదు చేసి జైలుకు పంపామని తెలిపారు.
News September 21, 2025
గుత్తివారిపల్లిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

రేణిగుంట మండలం గుత్తివారిపల్లి గ్రామ సచివాలయం సమీపంలోని పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. నీలం రంగు బనియన్, బ్లూ జీన్స్ ధరించి ఉన్నాడని, శరీరంపై గాయాలు లేవని, మద్యం అధికంగా సేవించడం వల్ల డీహైడ్రేషన్ లేదా అనారోగ్యం కారణమై ఉండవచ్చని రేణిగుంట అర్బన్ పోలీసులు అనుమానిస్తున్నారు. వయసు 25 నుంచి 30 ఏళ్ల ఉండొచ్చు అని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News September 21, 2025
FLASH.. పెండింగ్ బిల్లులు చెల్లించలేదని కాళోజీ కళాక్షేత్రానికి తాళం

పెండింగ్ బిల్లులు చెల్లించలేదని కాళోజీ కళాక్షేత్రానికి కాంట్రాక్టర్ తాళం వేశాడు. రూ.4కోట్ల బిల్లులు ఇవ్వట్లేదని హన్మకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రానికి కాంట్రాక్టర్ శ్రీకాంత్ రెడ్డి తాళం వేశాడు. కార్యక్రమం కోసం వెళ్లగా, తాళం వేసి ఉండటంతో అధికారులు ఖంగుతిన్నారు. కార్యక్రమాలు జరగకుండా తాళం వేసినందుకు కాంట్రాక్టర్ శ్రీకాంత్ రెడ్డిపై అధికారులు ఫిర్యాదు చేయగా సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు.