News September 21, 2025
ప్రొద్దుటూరులో పొలిటికల్ వార్

ప్రొద్దుటూరులో టీడీపీ, వైసీపీ నాయకుల నడుమ పొలిటికల్ వార్ జరుగుతోంది. ప్రభుత్వంలో హోదాలేని MLA కుమారుడు కొండారెడ్డిని ప్రభుత్వ కార్యక్రమాల్లోకి ఆహ్వానిస్తున్న అధికారుల పేర్లను బ్యాడ్ మెమోరీస్ బుక్‌లో రాసుకుంటున్నానని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శనివారం హెచ్చరించారు. దీనిపై ఆదివారం కొండారెడ్డి స్పందిస్తూ CM రిలీఫ్ ఫండ్ పంపిణీ, మున్సిపాలిటీ సమీక్షలో పాల్గొంటున్నానని చేతనైతే అడ్డుకోండి అంటూ సవాల్ చేశారు.
Similar News
News September 21, 2025
కడప జిల్లాకే తలమానికం ప్రొద్దుటూరు అమ్మవారి శాల

ప్రొద్దుటూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం విజయదశమి పర్వదినం సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక అలంకారంతో దర్శనమిస్తారు. చివరి రోజు అమ్మవారు ఊరేగింపు అంగరంగ వైభవంగా పురవీధులలో ఊరేగింపు చేయడం జిల్లాకే తలమానికంగా నిలుస్తుంది. పలు రకాల కళాకారులు నృత్య ప్రదర్శన, బాణాసంచ పేల్చడం ఒక ప్రత్యేకత సంచరించుకుంది. ఊరేగింపును తిలకించడానికి పక్క జిల్లా నుంచి కూడా భక్తులు పోటెత్తుతారు.
News September 21, 2025
ప్రొద్దుటూరు: కుందూనదిలో మృతదేహం.. వ్యాపారిదేనా?

చాపాడు సమీపంలోని కుందూ నదిలో ఆదివారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ మృతదేహం ఇటీవల ప్రొద్దుటూరులో కిడ్నాప్‌కు గురైన వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి మృతదేహమే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాన్ని పోలీసులు బయటికి వెలికి తీశారు. వేణుగోపాల్ రెడ్డిని కిడ్నాప్ చేసి, హత్య చేసిన తర్వాత నదిలో పడేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సింది.
News September 21, 2025
మైదుకూరు: రాయితీ నగదు కోసం ఎదురుచూపులు

ప్రభుత్వం వాణిజ్య పంటలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో రైతులకు పలు రాయితీలు కల్పిస్తోంది. అరటి పంటను సాగు చేస్తే హెక్టారుకు రూ.70 వేలు రాయితీ కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు రాయితీ సొమ్ము జమ కాలేదని రైతులు వాపోతున్నారు. రాయితీ సొమ్ము కోసం ఏడాదికాలంగా ఎదురుచూడాల్సి వస్తోందన్నారు. మైదుకూరు మండలంలో 200 హెక్టార్లకు పైగా అరటిని సాగు చేశారు. మీకు డబ్బులు పడ్డాయా?