News September 21, 2025
పెద్దపల్లి: అక్టోబర్ 3 వరకు దసరా సెలవులు

పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు దసరా సెలవులను నేటి నుంచి అక్టోబర్ 3 వరకు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. ప్రకటించిన విధంగా సెలవులు పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలలపై కఠిన చర్యలు తప్పవని ఆమె స్పష్టం చేశారు. విద్యార్థులు ఇంటి దగ్గర సెలవుల్లో జాగ్రత్తగా ఉండాలి DEO సూచించారు.
Similar News
News September 21, 2025
ఖమ్మం జిల్లాలో ఉత్సాహంగా పూల పండుగ

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను మహిళలు తమ గ్రామాల్లో అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు. రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను పేర్చి, యువతులు, మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. దీంతో ప్రతీ గ్రామం బతుకమ్మ పాటలతో మార్మోగిపోయింది. ఈ ఉత్సవాలు రానున్న 9 రోజుల పాటు వైభవంగా కొనసాగనున్నాయి.
News September 21, 2025
PGRS కార్యక్రమం రద్దు: ఎస్పీ కార్యాలయం

తిరుపతి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే పోలీస్ గ్రీవెన్స్ రీడ్రెసల్ సిస్టమ్ (PGRS) కార్యక్రమం రద్దు చేశారు. రేపు తిరుమలలో జరుగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, ప్రముఖుల రాక సందర్బంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రకటించింది. ప్రజలు గమనించాలని, అత్యవసర పరిస్థితుల్లో తమకు సమీపంలోని పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ఎస్పీ కార్యాలయం పేర్కొంది.
News September 21, 2025
కృష్ణానదిలో మృతదేహం లభ్యం: కొల్లూరు SI

కృష్ణానదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు కొల్లూరు SI జానకి అమర వర్ధన్ ఆదివారం తెలిపారు. SI వివరాల మేరకు.. ఈపూరులంక కృష్ణా నదిలో వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చింది. గ్రామస్థుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.