News September 21, 2025

వరంగల్: ఎడ్లబండి ఏడుస్తోంది..!

image

కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ పెరుగుతోంది. దీంతో వ్యవసాయానికి వాడే పనిముట్లను పక్కనబెట్టి యంత్రాలను వాడుతుండటంతో వాటినే నమ్ముకొని బతుకుతున్న వడ్రంగి వృత్తి వారికి ఉపాధి లేకుండా పోతోంది. దీంతో ఎడ్ల బండ్లు, నాగళ్లు కనుమరుగయ్యాయి. గ్రామాల్లో ఎక్కడో ఒకచోట మాత్రమే ప్రస్తుతం ఎడ్లబండ్లు కనిపిస్తున్నాయి. మానుకోట జిల్లా కౌసల్యాదేవిపల్లిలో ఓ రైతన్న ఎడ్లబండిని తీసుకెళ్తుండగా Way2News చిత్రీకరించింది.

Similar News

News September 21, 2025

రేపు విశాఖకు సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి జరిగే 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సుకు హాజరై ప్రసంగించనున్నారు. ఈ సదస్సుకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, Dy.CM పవన్, మంత్రి లోకేశ్ హాజరు కానున్నారు. మరోవైపు రేపు మ.3గంటలకు జాతీయ ఈ-గవర్నెన్స్ అవార్డుల ప్రదానం జరగనుంది. ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా సదస్సును నిర్వహిస్తున్నాయి.

News September 21, 2025

ఖమ్మం జిల్లాలో ఉత్సాహంగా పూల పండుగ

image

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను మహిళలు తమ గ్రామాల్లో అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు. రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను పేర్చి, యువతులు, మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. దీంతో ప్రతీ గ్రామం బతుకమ్మ పాటలతో మార్మోగిపోయింది. ఈ ఉత్సవాలు రానున్న 9 రోజుల పాటు వైభవంగా కొనసాగనున్నాయి.

News September 21, 2025

PGRS కార్యక్రమం రద్దు: ఎస్పీ కార్యాలయం

image

తిరుపతి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే పోలీస్‌ గ్రీవెన్స్‌ రీడ్రెసల్‌ సిస్టమ్‌ (PGRS) కార్యక్రమం రద్దు చేశారు. రేపు తిరుమలలో జరుగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, ప్రముఖుల రాక సందర్బంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రకటించింది. ప్రజలు గమనించాలని, అత్యవసర పరిస్థితుల్లో తమకు సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌ను సంప్రదించాలని ఎస్పీ కార్యాలయం పేర్కొంది.