News April 5, 2024

కాంగ్రెస్ మేనిఫెస్టో: సంక్షేమ పథకాలు, 25 గ్యారంటీలు

image

కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. న్యాయ్ యాత్ర పేరుతో 48పేజీల మేనిఫెస్టోను ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో ప్రకటించారు. సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారంటీలు ఈ మేనిఫెస్టోలో ఉన్నాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, చిదంబరం, కె.సి.వేణుగోపాల్ ఉన్నారు.

Similar News

News February 5, 2025

గురువారం చోరీలు, వీకెండ్‌లో జల్సాలు

image

TG: గచ్చిబౌలి <<15340404>>కాల్పుల కేసులో<<>> అరెస్టయిన బత్తుల ప్రభాకర్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘సరిపోదా శనివారం’లో నాని ఓ రోజు కోపాన్ని ప్రదర్శించినట్లుగా ప్రభాకర్‌కూ ఓ స్టైల్ ఉంది. వారంలో 3రోజులు ప్లానింగ్, గురువారం చోరీ, వీకెండ్‌లో జల్సాలు చేస్తాడు. ₹10L దొరుకుతాయనుకుంటే రంగంలోకి దిగుతాడు. జీవితంలో ₹335Cr కొట్టేయాలని, 100మంది అమ్మాయిలతో గడపాలనేది ఇతని లక్ష్యమని పోలీసుల విచారణలో వెల్లడైంది.

News February 5, 2025

ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక నేత కన్నుమూత

image

ప్రపంచ ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక నేత ఆగా ఖాన్(88) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆగా ఖాన్ డెవలప్‌మెంట్ నెట్ వర్క్ Xలో వెల్లడించింది. ఆయన వారసుడిని త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. ఆగా ఖాన్‌కు ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. 1957లో ఆయన ఇమామ్‌గా బాధ్యతలు స్వీకరించారు.

News February 5, 2025

పట్టణాలు చిన్నవే కానీ లగ్జరీ షాపింగ్‌లో టాప్!

image

భారత్‌లో చిన్న పట్టణాల ప్రజలు లగ్జరీ షాపింగ్‌పై భారీగా వెచ్చిస్తున్నారని టాటా క్లిక్ లగ్జరీ నివేదిక తెలిపింది. ఈ-కామర్స్ విస్తృతి పెరగడంతో మారుమూల పట్టణాల ప్రజలు సైతం ఆన్‌లైన్‌లో ఖరీదైన బ్రాండ్ల ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తున్నారని పేర్కొంది. ‘వాచీలు, చెప్పులు, దుస్తులు, యాక్సెసరీస్‌ను ఖర్చుకు వెనుకాడకుండా కొంటున్నారు. ఉత్పత్తిపై పూర్తిగా రిసెర్చ్ చేశాకే కొనుగోలు చేస్తున్నారు’ అని వెల్లడించింది.

error: Content is protected !!