News September 21, 2025
RDT సేవలపై ఆందోళన వద్దు: మంత్రి లోకేశ్

మంత్రి లోకేశ్‌తో ఆర్డీటీ డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ సమావేశమయ్యారు. RDTకి FCRAపై రెన్యువల్‌పై చర్చించారు. ‘ఎవరూ ఆందోళన చెందొద్దు. RDT సేవలు యథావిధిగా కొనసాగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ విషయంపై కేంద్రంతో చర్చలు జరుపుతున్నాం. సమస్యకు శాశ్వత పరిష్కరాం చూపుతాం’ అని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. తెలుగు ప్రజలతో సేవా బంధం పెనవేసుకున్న ఆర్డీటీని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందని పేర్కొన్నారు.
Similar News
News September 21, 2025
పండుగ పూట తీవ్ర విషాదం.. ఇద్దరు చిన్నారులు మృతి

కరీంనగర్‌లో పండుగ పూట తీవ్ర విషాదం నెలకొంది. బొమ్మకల్ రోడ్డులో ఉన్న సిమెంట్ పైపుల ఫ్యాక్టరీలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. బిహార్‌కు చెందిన బిట్టు కుమార్-సుధాదేవి కుమారులు సత్యం కుమార్, ఆర్యన్ కుమార్ ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు పైపులు కూలింగ్ చేసే ట్యాంకులో పడిపోయారు. గమనించిన ఫ్యాక్టరీ సిబ్బంది వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News September 21, 2025
డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే: కలెక్టర్

అతిసార లక్షణాలున్న ప్రాంతాల్లో 33 బృందాలతో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ నెల 16 నుంచి ఇప్పటివరకు 80 కేసులు నమోదయ్యాయని చెప్పారు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నవారిలో 13 మందిని సాధారణ వార్డులకు తరలించామని, 11 మంది డిశ్చార్జ్ అయ్యారని వివరించారు.
News September 21, 2025
రేపు విశాఖకు సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి జరిగే 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సుకు హాజరై ప్రసంగించనున్నారు. ఈ సదస్సుకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, Dy.CM పవన్, మంత్రి లోకేశ్ హాజరు కానున్నారు. మరోవైపు రేపు మ.3గంటలకు జాతీయ ఈ-గవర్నెన్స్ అవార్డుల ప్రదానం జరగనుంది. ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా సదస్సును నిర్వహిస్తున్నాయి.