News September 21, 2025
HYD: ఉస్మానియా ఆసుపత్రి హెల్ప్ లైన్ నంబర్ ఇదే..!

హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో వైద్య సేవలు, ఎమర్జెన్సీ సేవలు తెలుసుకోవడానికి ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేశామని డాక్టర్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి శస్త్రచికిత్సలు, వైద్యం కోసం వస్తున్న వారికి ఈ నంబర్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. 7780288622 నంబర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని సమాచారం.
Similar News
News September 21, 2025
HYD: విద్యార్థికి అన్ని విధాలా అండగా ఉంటాం: ఢిల్లీ పబ్లిక్ స్కూల్

గత నెల 29వ తేదీన ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో జరిగిన ఘటనకు తాము చింతిస్తున్నామని యాజమాన్యం ఈరోజు ఓ ప్రెస్‌నోట్ రిలీజ్ చేసింది. విద్యార్థుల పరిరక్షణకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని చెప్పింది. విద్యార్థికి గాయాలైన వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని పేర్కొంది. విద్యార్థి కోలుకున్న తర్వాత చదువు విషయంలో ఇబ్బంది కలగకుండా అండగా ఉంటామని హామీ ఇచ్చింది.
News September 21, 2025
HYD: ‘కమీషన్ల కోసం దొంగ టిక్కెట్లు..!’

గ్రేటర్ HYD వ్యాప్తంగా రోజుకు 26 లక్షల మంది ఆర్టీసీలో ప్రయాణిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో మహాలక్ష్మి ప్రయాణాలు 72% ఉన్నట్లు తెలిపారు. అనేక డిపోలకు టార్గెట్లు నిర్ణయించగా కొంత మంది కండక్టర్లు కమీషన్ల కోసం దొంగ టికెట్లు కొడుతున్నట్లు గుర్తించి పలుచోట్ల హెచ్చరించినట్లు అధికారులు చెప్పారు.
News September 21, 2025
HYD: పేదలు నివసిస్తున్న ప్రాంతాలను తొలగించట్లేదు: కమిషనర్

మేడ్చల్ జిల్లా <<17784226>>గాజులరామారంలో<<>> ప్రభుత్వ భూముల ఆక్రమణలను మాత్రమే తొలగిస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈరోజు స్పష్టం చేశారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్న వారిలో రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు ఉన్నారని, 40 ఎకరాల్లో పేదలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారన్నారు. అధికారులతో స్థానిక నేతలు కుమ్మక్కై పేదలకు స్థలాలు విక్రయించారని, పేదలు నివసిస్తున్న ప్రాంతాలను హైడ్రా తొలగించట్లేదని కమిషనర్ పేర్కొన్నారు.