News April 5, 2024

కచ్చతీవు ద్వీపం వివాదంపై స్పందించిన శ్రీలంక

image

<<12964536>>కచ్చతీవు<<>> ద్వీపాన్ని భారత్ తిరిగి స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్లకు ఎలాంటి ఆధారం లేదని శ్రీలంక మంత్రి డగ్లస్ దేవానంద అన్నారు. ‘1974 ఒప్పందం ప్రకారం కచ్చతీవును శ్రీలంకకు అప్పగించారు. 1976లో కుదిరిన మరో ఒప్పందం ప్రకారం కన్యాకుమారికి దిగువన వెస్ట్ బ్యాంకు ప్రాంతం భారత్‌కు దక్కింది. అది కచ్చతీవు కంటే 80 రెట్లు పెద్దది’ అని తెలిపారు. ఎన్నికల వేళ ఈ ద్వీపం వ్యవహారం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

Similar News

News October 8, 2024

బాలికపై అత్యాచారం.. స్పందించిన పవన్

image

AP: పిఠాపురంలో <<14301232>>మైనర్<<>> బాలికపై జరిగిన అఘాయిత్యం తనకు బాధ కలిగించిందని పవన్ కళ్యాణ్ అన్నారు. స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారని, లేదంటే తప్పించుకునేవాడని తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించానన్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

News October 8, 2024

త్వరలో గ్రామబాట కార్యక్రమం: పెద్దిరెడ్డి

image

AP: వైసీపీ ఆధ్వర్యంలో త్వరలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ బాట కార్యక్రమం చేపడతామని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకులతో తిరుపతిలో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ కోసం శ్రమిస్తున్న వారికి పదవులు ఇస్తామని తెలిపారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం, మాజీ ఎంపీ రెడ్డప్ప, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు సమావేశానికి హాజరయ్యారు.

News October 8, 2024

తాజ్‌మహల్ అందం.. మాటల్లో చెప్పలేం: ముయిజ్జు

image

భారత పర్యటనలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు తాజాగా తాజ్‌మహల్‌ను సతీసమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆ కట్టడం అందానికి ముగ్ధుడయ్యారు. ‘ఈ సమాధి మందిర అందాన్ని మాటల్లో వర్ణించడం అసాధ్యం. ప్రేమకు, నిర్మాణ నైపుణ్య పరాకాష్ఠకు ఇది సజీవ సాక్ష్యం’ అని విజిటర్ బుక్‌లో రాశారు. భారత్‌లో 4 రోజుల టూర్‌లో భాగంగా ఆయన నేడు ముంబై, రేపు బెంగళూరులో పర్యటించనున్నారు.