News September 21, 2025

బతుకమ్మ చీర: ఇప్పుడు ఒకటి.. సంక్రాంతికి మరొకటి!

image

TG: బతుకమ్మ చీరల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అనుకున్న సమయానికి చీరలు రాకపోవడంతో ఈ బతుకమ్మకు ఒక చీర, సంక్రాంతి లోపు మరో చీర ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2-3 రోజుల్లో చీరల పంపిణీ ప్రారంభం కానుంది. మహిళా సంఘాల సభ్యులకు మాత్రమే చీరలు ఇవ్వనున్నారు. ఈ సారి ఒక్కో చీరకు ప్రభుత్వం రూ.800 చొప్పున ఖర్చు చేస్తోంది.

Similar News

News September 22, 2025

రేపు ‘దసరా బోనస్’ ప్రకటించనున్న సీఎం!

image

TG: సింగరేణి ఉద్యోగులకు CM రేవంత్ రేపు ‘దసరా బోనస్’ ప్రకటించనున్నట్లు సమాచారం. శాశ్వత ఉద్యోగులకు రూ. 1.90 లక్షలు, తాత్కాలిక ఉద్యోగులకు రూ. 5వేల వరకు బోనస్ లభించే అవకాశం ఉంది. అలాగే సింగరేణి ఉద్యోగుల సంక్షేమం కోసం కొన్ని ప్రకటనలు చేయనున్నట్లు తెలుస్తోంది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఏటా బొగ్గు అమ్మకాలు, మైనింగ్, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా వచ్చే లాభాల నుంచి ఉద్యోగులకు బోనస్ ఇస్తోంది.

News September 22, 2025

US H-1Bకి పోటీగా చైనా ‘K వీసా’!

image

ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాలెంటెడ్ ప్రొఫెషనల్స్‌ను ఆకర్షించేందుకు చైనా కొత్తగా ‘K వీసా’ను ప్రవేశపెట్టింది. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ & మ్యాథమెటిక్స్ (STEM) రంగాల్లో స్కిల్డ్ మ్యాన్‌ఫోర్స్ కోసం OCT 1 నుంచి ఈ వీసాను అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. నిపుణులు దీన్ని US H-1B వీసాకు పోటీగా అభివర్ణిస్తున్నారు. వీసా ఫీజును US లక్ష డాలర్లకు పెంచడం చైనాకు కలిసొచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

News September 22, 2025

రేపు పలు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమ‌వారం భారీ వ‌ర్షాలు ప‌డ‌నున్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంద‌ని తెలిపింది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉండ‌టంతో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పేర్కొంది.