News September 21, 2025

అనకాపల్లి: రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

అనకాపల్లి కలెక్టరేట్తో పాటు మండల, మున్సిపల్, డివిజన్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. నేరుగా రాలేనివారు సమస్యలను meekosam.ap.gov.in వెబ్ సైట్ ద్వారా పంపించడానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. అర్జీల పరిస్థితి తెలుసుకునేందుకు 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చునన్నారు.

Similar News

News September 22, 2025

‘ఇది నా మరణ వాంగ్మూలం’.. మాజీ డీఎస్పీ పోస్ట్

image

TG: మాజీ డీఎస్పీ నళిని తన ‘మరణ వాంగ్మూలం’ అంటూ FBలో పోస్ట్ పెట్టడం చర్చనీయాంశమైంది. తన ఆరోగ్య పరిస్థితి కొంత కాలంగా ఆందోళనకరంగా ఉందని తెలిపారు. ‘నా జీవితం ముగియబోతోంది. సాయం చేయాలని CMకు ఇచ్చిన అర్జీ బుట్టదాఖలైంది. కేంద్రం సాయం చేస్తే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతాను. నేను స్థాపించిన వేదామృతం ట్రస్టుకు నా మరణానంతరం మోదీ సాయం చేయాలి. నా మరణాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దు’ అని పేర్కొన్నారు.

News September 22, 2025

కాళోజీ కళాక్షేత్రంలో చాకలి ఐలమ్మ జీవిత చరిత్ర నాటకం.!

image

హనుమకొండ జిల్లాలోని కాళోజీ కళాక్షేత్రంలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జీవిత చరిత్ర నృత్య రూపం అలరించింది. అకాడమీ ఛైర్ పర్సన్ పుంజాల అలేఖ్య పోషించిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పాత్ర అద్భుతం. ఆనాటి నియంతృత్వ, దోపిడీ, పెత్తందారుల ఆగడాలను కళాబృందం ఎంతో కళ్లకు కట్టినట్టు ప్రదర్శించిన తీరు అభినందనీయం. నృత్య రూపకం ప్రదర్శించిన కళాకారులను అభినందించారు.

News September 22, 2025

యాదాద్రిపై రేపటి నుంచి శరన్నవరాత్రోత్సవాలు

image

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కొండపై ఉన్న శ్రీ పర్వతవర్ధినీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ ఈవో వెంకట్రావు వెల్లడించారు. ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి అర్చనలు, లక్ష కుంకుమార్చనలు, చండీ హోమం నిర్వహించనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు.