News September 21, 2025
రేపటి ప్రజావాణి రద్దు: కలెక్టర్

సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు. 23న సీఎం రేవంత్ రెడ్డి మేడారం పర్యటన ఉండటంతో అధికారులంతా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని, అందుకే కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. వచ్చే సోమవారం గ్రీవెన్స్ డే యథావిధిగా జరుగుతుందని వెల్లడించారు.
Similar News
News September 22, 2025
FLASH: HYD-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వరద

హయత్‌నగర్‌లో HYD-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు నిలిచిపోయింది. ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి సమీప రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులకు మరోసారి ఇబ్బందులు తప్పడం లేదు. అటు దసరా సెలవుల నేపథ్యంలో సొంతూళ్లకు బయలు దేరిన ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
News September 22, 2025
‘ఇది నా మరణ వాంగ్మూలం’.. మాజీ డీఎస్పీ పోస్ట్

TG: మాజీ డీఎస్పీ నళిని తన ‘మరణ వాంగ్మూలం’ అంటూ FBలో పోస్ట్ పెట్టడం చర్చనీయాంశమైంది. తన ఆరోగ్య పరిస్థితి కొంత కాలంగా ఆందోళనకరంగా ఉందని తెలిపారు. ‘నా జీవితం ముగియబోతోంది. సాయం చేయాలని CMకు ఇచ్చిన అర్జీ బుట్టదాఖలైంది. కేంద్రం సాయం చేస్తే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతాను. నేను స్థాపించిన వేదామృతం ట్రస్టుకు నా మరణానంతరం మోదీ సాయం చేయాలి. నా మరణాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దు’ అని పేర్కొన్నారు.
News September 22, 2025
కాళోజీ కళాక్షేత్రంలో చాకలి ఐలమ్మ జీవిత చరిత్ర నాటకం.!

హనుమకొండ జిల్లాలోని కాళోజీ కళాక్షేత్రంలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జీవిత చరిత్ర నృత్య రూపం అలరించింది. అకాడమీ ఛైర్ పర్సన్ పుంజాల అలేఖ్య పోషించిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పాత్ర అద్భుతం. ఆనాటి నియంతృత్వ, దోపిడీ, పెత్తందారుల ఆగడాలను కళాబృందం ఎంతో కళ్లకు కట్టినట్టు ప్రదర్శించిన తీరు అభినందనీయం. నృత్య రూపకం ప్రదర్శించిన కళాకారులను అభినందించారు.